OTT: అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్..ఈ యాక్షన్ కామెడీ మూవీస్ చూసారా?

ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో జనం అంతా తమ బిజీ లైఫ్ కి ఎంటర్టైన్మెంట్ ప్లాట్ ఫామ్ లతోనే కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. దీనితో థియేటర్స్ లేదా ఓటిటిలే ఎక్కువ వారికి ప్రథమ ఎంటర్టైనింగ్ ఛాయిస్ లు గా నిలుస్తున్నాయి. మరి ఇందులో థియేటర్స్ పక్కన పెడితే ఓటిటి విషయంలో మాత్రం చాలానే యాప్స్ వాటి మధ్య పోటీ గట్టిగా ఉంటుంది. వారం వారంకే కొత్త కంటెంట్ పడకపోతే ఇప్పుడు జనం ఆసక్తి చూపించట్లేదు.

దీనితో ప్రతి వారం కూడా ఏదొక కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ లాంటి వాటిని స్ట్రీమింగ్ యాప్స్ తీసుకొస్తూ ఉంటారు. కాగా ఓటిటి వినియోగం మన దేశంలోకి అందులోని మన తెలుగులో కూడా తక్కువేమి కాదు. చాలా వరకు సినిమాలు అయితే కొంతమంది ఓటిటిలో వచ్చేస్తుందిలే థియేటర్ కి ఏం వెళ్తాం అని ఆగిపోయేవారు చాలా మందే ఉన్నారు. దీనితో ఏ రేంజ్ లో ఓటిటి పాతుకుపోయిందో మనం అర్ధం చేసుకోవాలి.

Amazon Prime Video Top Trending Action Movies Have watched it

ఇలా ప్రతి వారం కొత్త కంటెంట్ పలు స్ట్రీమింగ్ యాప్స్ లో వస్తుండగా ఈ యాప్స్ లో ప్రముఖ సంస్థ ప్రైమ్ వీడియో కూడా ఒకటి. దీనికి మన దేశంలో కూడా అత్యధిక వినియోగదారులు కూడా ఉన్నారు. మరి ఇందులో లేటెస్ట్ గా కొన్ని సాలిడ్ యాక్షన్ డ్రామాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలా రావడంతోనే అవి ఇండియా వైడ్ గా టాప్ లో ట్రెండింగ్ లోకి వచ్చేయడం విశేషం.

కాగా ఈ చిత్రాలు చూసినట్టు అయితే రీసెంట్ గా రెండు హాలీవుడ్ యాక్షన్ సినిమాలు రిలీజ్ కి వచ్చాయి అందులో సూపర్ మ్యాన్ నటుడు హెన్రీ కవిళ్ నటించిన మిలట్రీ బ్యాక్ డ్రాప్ యాక్షన్ చిత్రం "ది మినిస్ట్రీ ఆఫ్ అన్ జెంటిల్మన్లీ వార్ ఫేర్" ఒకటి. ఇది కేవలం కొన్ని రోజులు కితమే అందుబాటులోకి రాగా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారిలో మంచి రెస్పాన్స్ అందుకుంది.

దర్శకుడు గయ్ రిచి తెరకెక్కించిన ఈ చిత్రంలో వరల్డ్ వార్ 2 సమయంలో జరిగే కొన్ని కల్పిత సంఘటనల ఆధారంగా అయితే తెరకెక్కించారు. ఇందులో అదిరే యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. మరి ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇక దీని తర్వాతే మరో హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రెండింగ్ లో నిలిచింది.

Amazon Prime Video Top Trending Action Movies Have watched it

ప్రముఖ నటుడు, రెజ్లర్ అయినటువంటి డేవ్ బాటిస్టా హీరోగా నటించిన ఒక స్పై యాక్షన్ అండ్ కామెడీ థ్రిల్లర్ ఇది. "మై స్పై ది ఎటర్నల్ సిటీ" అనే ఈ చిత్రాన్ని పీట్ సెగల్ దర్శకత్వం వహించగా ఒక సీక్రెట్ వెపన్ ని సొంతం చేసుకొని కొందరు విలన్స్ ఒక నగరాన్ని తుడిచి పెట్టెయ్యాలని చూస్తారు మరి దీనిని హీరో తన కూతురు, తన టీం తో కలిసి ఎలా ఆపాడు అనేది మిగతా కథ. కొంచెం రెగ్యులర్ గానే అనిపించినా పర్వాలేదు అంటే ఓటిటిలో ఈ యాక్షన్ డ్రామాని కూడా తప్పకుండా ట్రై చేయవచ్చు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ లో కూడా అందుబాటులో ఉంది.

ఇక ప్రైమ్ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతున్న యాక్షన్ సినిమాల్లో రీసెంట్ మన తెలుగు చిత్రం నవ దళపతి సుధీర్ బాబు నటించిన "హరోం హర" ఉంది. మరి దీనిని జ్ఞాన సాగర్ ద్వారకా తెరకెక్కించాడు. థియేటర్స్ లో పెద్దగా రన్ అవ్వలేదు కానీ మంచి యాక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లని ఇష్టపడే వారు దీనిని చూడొచ్చు. ఇది టాప్ 4 లో ట్రెండ్ అవుతుంది. ఇక ఫైనల్ గా ప్రైమ్ వీడియోలో ఇంట్రెస్టింగ్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "జైలర్" టాప్ 9 లో ట్రెండ్ అవుతుండడం విశేషం. ఆల్రెడీ ఈపాటికే చాలా మంది చూసేసి ఉంటారు యాక్షన్, కామెడీ బ్యాక్ డ్రాప్ లో అయితే ఈ సినిమా కూడా ట్రెండ్ అవుతుంది కాబట్టి దీన్నీ ట్రై చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X