OTT: ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతున్న టాప్ సినిమాలివే.. వీటిని మాత్రం డోంట్ మిస్

వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ఆడియెన్స్ కి ఓటిటిలు ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాయి అనేది అందరికీ తెలిసిందే. కాగా ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పాపులర్ ఓటిటి సంస్థలు ఎప్పటికప్పుడు సాలిడ్ కంటెంట్ ని అందిస్తున్నాయి. వెబ్ సిరీస్ లు ఇంకా కొత్త కొత్త సినిమాలని స్ట్రీమింగ్ యాప్స్ తీసుకొస్తూ ఉంటాయి. అలా ఒకో దేశంలో ఆయా భాషల్లో కంటెంట్ ట్రెండింగ్ లో ఉంటుంది.

ఇపుడు మన దేశంలో కూడా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం పలు చిత్రాలు ట్రెండింగ్ లో నిలిచాయి. అయితే ఈ టాప్ 10 ట్రెండింగ్ లో కొన్ని మాత్రం డెఫినెట్ వాచ్ సినిమాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. కాగా ఆ సినిమాలు ఏవో చూస్తే.. మొదటి ప్లేస్ లో రీసెంట్ గా వచ్చిన తమిళ చిత్రం "రాయన్" ట్రెండ్ అవుతుంది.

amazon prime video top trending movies these movies you dont miss

హీరో ధనుష్ హీరోగా, దర్శకత్వం కూడా తానే వహించిన ఈ చిత్రం ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో వాచ్ అని చెప్పొచ్చు. ఇక రెండో ప్లేస్ లో భారీ చిత్రం కల్కి ట్రెండ్ అవుతుంది. ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కలయికలో వచ్చిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఆశ్చర్యకరంగా రెండో స్థానంలో ట్రెండ్ అవుతుంది.

దీనిని తప్పకుండా ఎవరైనా చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక దీని తర్వాత టాప్ 3 లో ట్రెండ్ అవుతున్న సినిమా కోసం మాట్లాడుకోవాలి. ఆ సినిమానే "చందు ఛాంపియన్". బాలీవుడ్ టాలెంటెడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ చిత్రం నిజ జీవిత స్పోర్ట్స్ పర్శనాలిటీ మురళికాంత్ పేట్కర్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ఈ చిత్రం డెఫినెట్ గా మస్ట్ వాచ్ సినిమా అని చెప్పొచ్చు.

amazon prime video top trending movies these movies you dont miss

మూవీ లవర్స్ అయ్యి ఉండి మన దేశంపై అపారమైన గౌరవం ఉన్నవాళ్లు ఈ ఎమోషనల్ సినిమాని ట్రై చెయ్యండి. ఇక మిగతా చూడదగ్గ సినిమాలు చూస్తే రానా, ఆర్య కలయికలో వచ్చిన ఒక కామెడీ డ్రామా ఎప్పుడో 2016లో వచ్చిన సినిమాని రీసెంట్ గానే తెలుగులో ప్రైమ్ వీడియో వారు తీసుకొచ్చారు. చాలా తక్కువ మందికి ఈ సినిమా కోసం తెలిసి ఉండొచ్చు.

డీసెంట్ కామెడీ సినిమా చూడాలి అనుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. ఇది టాప్ 6 లో ట్రెండ్ అవుతుంది. ఇక ఇవేవి కాదు కొత్త సినిమా ఏదన్నా చూడాలి అనుకుంటే విజయ్ ఆంటోనీ నటించిన రీసెంట్ సినిమానే కొన్ని వారాల కితమే వచ్చింది ఆ సినిమానే "తుఫాన్" తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది టాప్ 5 లో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే తెలుగు ఆడియెన్స్ చూడదగ్గ సినిమాలు అది కూడా ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు ఏవైనా ఉన్నాయి అంటే ఇవే అని చెప్పొచ్చు. మిగతావి అన్నీ కొన్ని పాత సినిమాలే ఉన్నాయి ఇతర భాషల్లో ఉన్నాయి సో వాటి కోసం అవసరం లేదు.

More from Filmibeat

Read more about: dhanush prabhas kalki 2898 ad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X