ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఆ యూజర్లకు ఒకరోజు ముందే!

గతంలో కంటే ఇప్పుడు కంటెంట్ బేస్‌డ్ మూవీలు తెలుగులో ఎక్కువగానే వస్తున్నాయి. అందులోనూ రియలిస్టిక్ సీన్స్‌తో చాలా చిత్రాలు తెరకెక్కుతోన్నాయి. అలాంటి వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇటీవలే అలా వచ్చిన సినిమానే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'. టాలెంటెడ్ గాయ్ సుహాస్ ఈ మూవీలో హీరోగా నటించిన విషయం తెలిసిందే.

నేచురల్ యాక్టర్ సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికనేని రూపొందించిన చిత్రమే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'. ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన ఈ మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా ఈ సినిమాకు వసూళ్లు కూడా అత్యధికంగానే వచ్చాయి.

Ambajipeta Marriage Band Movie Streaming From March 1st

ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమా థియేటర్లలో దాదాపు రెండు వారాల పాటు గట్టిగానే రన్‌ను కొనసాగించింది. ఇలా ఈ చిత్రం టార్గెట్‌ను చేరుకుని క్లీన్ హిట్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో రెండు కోట్ల రూపాయలకు పైగా లాభాలను కూడా సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్‌గా హిట్‌గా సత్తా చాటుకుంది.

థియేటర్లలో ప్రేక్షకుల మెప్పును పొందిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించి మంచి పోటీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఇందుకోసం నిర్మాతలకు సదరు సంస్థ మంచి మొత్తాన్ని కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎన్నో ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆహా సంస్థ ఈ చిత్రం మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ అవబోతుందని తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రమోషనల్ వీడియోను కూడా వదిలింది. ఇక, ఆహా గోల్డ్ మెంబర్‌షిప్ ఉన్న యూజర్లకు ఈ చిత్రం ఫిబ్రవరి 29 సాయంత్రం నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిసింది.

ఇదిలా ఉండగా.. 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీని ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ నిర్మించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. ఇందులో శివానీ హీరోయిన్‌గా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X