ఓటీటీలోకి వచ్చేసిన హిట్టు బొమ్మ.. ఆ యూజర్లే కాదు వీళ్లు కూడా చూసేయొచ్చు!
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలు పెట్టి.. తమదైన నటనతో మెప్పించి.. ఆ తర్వాత హీరోలుగా మారిన వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. అందులో టాలెంటెడ్ గాయ్ సుహాస్ ఒకడు. ఇప్పటికే హీరోగా రెండు హిట్లను అందుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. అలా ఇటీవలే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ చేశాడు.
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'. దుశ్యంత్ కటికనేని రూపొందించిన ఈ మూవీ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీంతో ఆరంభంలోనే ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడగా.. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇక, నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

పల్లెటూరిలోని పరిస్థితులకు అద్దం పట్టే కంటెంట్‌తో రూపొందిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీకి థియేటర్లలో భారీ రెస్పాన్సే వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం మంచి లాభాలను కూడా సొంతం చేసుకుంది. అయితే, థియేటర్లలో మాత్రం ఎక్కువ రోజులు రన్‌ను కొనసాగించలేకపోయింది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మనసుకు హత్తుకునే కథతో రూపొందిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రాన్ని మార్చి 1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు కూడా సదరు సంస్థ ప్రకటించింది. అయితే గోల్డ్ మెంబర్‌షిప్ ఉన్న వాళ్లకు ఒకరోజు ముందే అందుబాటులోకి తెచ్చింది.

టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీని ఆహా సంస్థ గత ఆర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చేసింది. అంటే ఇప్పుడు సాధారణ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు కూడా ఈ సినిమాను అందులో చూడొచ్చన్న మాట. ఇక, థియేటర్లలో మాదిరిగానే ఆహాలో కూడా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'కు మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలిసింది.
ఇదిలా ఉండగా.. సుహాస్ - దుశ్యంత్ కాంబోలో రూపొందిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీని ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ నిర్మించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. ఇందులో శివానీ హీరోయిన్‌గా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ కీలక పాత్రలను చేశారు.


Click it and Unblock the Notifications











