ఓటీటీలోకి భయపెట్టే సైకో కిల్లర్ మూవీ.. బిగ్ బాస్ స్టార్ చేసిన దీన్ని ఎక్కడ చూడాలంటే!

సినిమాలకు సంబంధించి ఎన్నో రకాల జోనర్లు ఉన్నాయి. కానీ, అందులో కొన్నింటికి మాత్రమే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ లభిస్తోంది. అయితే, ఈ మధ్య ఎక్కువగా ఆడియెన్స్‌ను అలరిస్తోన్న చిత్రాలు క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్నవే అని ప్రత్యేకంగా చెప్పాలి. ఇలా ఎన్నో సినిమాలు రాగా అవన్నీ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే వచ్చిన చిత్రమే 'తెప్ప సముద్రం'.

బుల్లితెర నటుడు, బిగ్ బాస్ ఫేం అంబటి అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే 'తెప్ప సముద్రం'. తెప్ప సముద్రం అనే ప్రాంతంలో చిన్నారులు మిస్ అవడం, ఆ తర్వాత వాళ్లు హత్యాచారాలకు గురి అవడం అనే కాన్సెప్టుతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ పరిస్థితుల్లో పోలీసులు, మీడియాతో కలిసి ఈ కేసులను ఎలా ఛేదించింది అనే కథతో ఇది వచ్చేసింది.

Ambati Arjun Starrer Theppa Samudram Movie Streaming On AHA From August 3rd

భయపెట్టే సైకో కిల్లర్ స్టోరీతో సతీష్ రాపోలు అనే దర్శకుడు తెరకెక్కించిన 'తెప్ప సముద్రం' సినిమా ఏప్రిల్ 19వ తేదీన థియేటర్లలోకి వచ్చేసింది. దీనికి ఆశించిన స్థాయిలో మౌత్ టాక్ రాకపోవడంతో ప్రేక్షకుల నుంచి కూడా స్పందన రాలేదు. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో ఈ చిత్రం ఓటీటీ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

మర్డర్ మిస్టరీ కాన్సెప్టుతో రూపొందిన 'తెప్ప సముద్రం' సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ హక్కులకు మంచి డిమాండ్ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.

Ambati Arjun Starrer Theppa Samudram Movie Streaming On AHA From August 3rd

అంబటి అర్జున్ నటించిన 'తెప్ప సముద్రం' సినిమా పరాజయం పాలైనా ఓటీటీలోకి మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 3వ తేదీ నుంచే ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు ఆహా సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు 'సుడిగుండాల సముద్రంలో తెప్ప తీరం దాటేనా? తెప్ప సముద్రం మీ ఆహాలో వస్తుంది' అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను సైతం విడుదల చేసింది.

ఇదిలా ఉండగా.. అంబటి అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన 'తెప్ప సముద్రం' సినిమాను సతీష్ రాపోలు తెరకెక్కించాడు. దీన్ని రాఘవేందర్ గౌడ్, నిరకంటి మంజులలు నిర్మించారు. ఇందులో చైతన్య రావు, రవి శంకర్‌లు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి రోహిత్ పెద్దపల్లి సంగీతాన్ని అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X