OTT నుంచి నయనతార కొత్త సినిమా తొలగింపు... కారణం ఏంటంటే?

ఈ ఏడాది లేడీ సూపర్ స్టార్ నయనతారకు అంతగా కలిసిరావడం లేదనే చెప్పాలి. ఆమె నటించిన అన్నపూర్ణి చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా గత కొన్నిరోజులుగా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ తెరకెక్కించింది. ఇప్పుడు ఈ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ చిత్రాన్ని తొలగించినట్లు ప్రకటించింది. అసలు ఈ సినిమా ఎందుకు తొలగించాల్సి వచ్చింది.. అందులో ఏం ఉంది.. అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

లేడీ సూపర్ స్టార్ గా పేరుతెచ్చుకున్న నయనతార గత ఏడాది జవాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతే కాదు.. ఈ సినిమాతోనే ఆమె బాలీవుడ్ ఆరంగేట్రం చేసింది. ఇక ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక ఈ చిత్రం తర్వాత నయన్.. అన్నపూర్ణి అనే చిత్రంలో నటించింది. ఈ మూవీకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ డిజిటల్ ప్రీమియర్ హక్కులను సొంతం చేసుకుంది.

Amid Controversies Nayanthara Annapoorani Movie is Removed From Netflix OTT Full Details Here

నయనతార 75వ చిత్రంగా తెరకెక్కిన ఈ అన్నపూర్ణి గత నెలలో నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదల అయింది. ఇక విడుదల అయిన మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ సినిమాకు మంచి ఆదరణ అయితే లభించింది కానీ.. పలు సవాళ్లను ఎదుర్కొంది.

Amid Controversies Nayanthara Annapoorani Movie is Removed From Netflix OTT Full Details Here

ఇటీవల, మాజీ శివసేన నాయకుడు రమేష్ సోలంకి ఈ చిత్రాన్ని హిందూ వ్యతిరేకి అని విమర్శించారు. ఈ సినిమాలో రాముడ్ని కించపరిచే సన్నివేశాలు, ఉన్నాయంటూ ... దీనిపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా "లవ్ జిహాద్"ను బలపరిచేలా ఉందని సోలంకి ఆరోపణలు చేశారు. ఈ సినిమాపై మేకర్స్‌ మీద కేసును కూడా నమోదు చేసారు.

రెండు రోజుల క్రితం.. విశ్వహిందూ పరిషత్ నాయకుడు శ్రీరాజ్ నాయర్ కూడా రాముడిపై కించపరిచే వ్యాఖ్యలను ఖండించారు. ఈ సినిమాలో రాముడిని, అతన్ని మాంసం తినేవాడు అని ముద్ర వేశారంటూ విమర్శలు చేశారు. నెట్‌ ఫ్లిక్స్ నుండి సినిమాను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. సినిమా వెనుక బ్యానర్ అయిన జీ స్టూడియోస్‌ను హెచ్చరించారు కూడా.

Amid Controversies Nayanthara Annapoorani Movie is Removed From Netflix OTT Full Details Here

ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ఓటీటీ స్ట్రీమింగ్‌ నుంచి తొలగించింది. మత విశ్వాసాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని వివరణ తెలిపింది. తమ సినిమా ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమపణలు కొరింది. మరి కొత్త వర్షన్ అన్నపూర్ణి ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది.. అనే వివరాలుపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను తొలగించడంపై నయనతార ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమాను సినిమాలాగే చూడాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. వెంటనే స్ట్రీమింగ్ కు తీసుకురావాలి డిమాండ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X