OTTలోకి మరో హిట్ యాక్షన్ థ్రిల్లర్.. ట్విస్టులే ట్విస్టులు.. డోంట్ మిస్!
ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా వచ్చేస్తుంది. ఈ మధ్య యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థలు కూడా వేరే లాంగ్వేజ్ సినిమాలను అన్ని భాషల్లో డబ్ చేసి.. రిలీజ్ చేస్తున్నారు. తాజాగా అర్జున్ విజయ్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మిషన్ ఛాప్టర్ 1 ఓటీటీలోకి వచ్చేసింది. అసలు ఈ సినిమా కథేంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది.. ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.
రామ్ చరణ్ హీరోయిన్: అమీ జాక్సన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు చిత్రంలో రామ్ చరణ్ గర్ల్ ఫ్రెండుగా నటించి మెప్పించింది. ఇక ఆ సినిమాతో తెలుగు వారికి సుపరిచితం అయింది. ఇక విక్రమ్ నటించిన ఐ సినిమా, ధనుష్ నటించిన నవమన్మధుడు లాంటి సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. ఇక ఈ భామకు తెలుగులోనూ మంచి క్రైజ్ ఏర్పడింది. ఇక ఈ భామ పెళ్లి చేసుకోకుండానే తల్లిగా మారడంతో సినిమాలకు దూరమైపోయింది.

సంక్రాంతి కానుకగా: సుమారు ఆరేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్రిటిష్ బ్యూటీ.. ఇటీవల సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మిషన్ చాఫ్టర్ 1 అనే సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఏ ఎల్ విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సాహో చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అర్జున్ విజయ్ గుర్తుండే ఉంటుంది. అతను ఈ సినిమాలో హీరోగా నటించి మెప్పించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లకు ఈ సినిమా వచ్చింది.

సంక్రాంతి బ్లాక్ బస్టర్: ఇక మిషన్ చాప్టర్ 1 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాగా.. ప్రేక్షకులను బాగా మెప్పించింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్, యాక్షన్ అంశాలు ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లను రాబట్టింది. కానీ కొన్ని కారణాలతో థియేటర్లలో తెలుగు వెర్షన్ ను విడుదల చేయలేకపోయారు. దానికి కారణం బాక్సాఫీస్ వద్ద మన తెలుగుల సినిమాలు 4,5 ఉన్నాయి. మనకే థియేటర్లు సరిపోవడం లేదు..దీంతో తెలుగులో రిలీజ్ చేయలేదు.

మార్చి 1 నుంచి స్ట్రీమింగ్: అయితే ఇప్పుడు మిషన్ ఛాప్టర్ 1 ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ నెట్ ఫ్లిక్స్ ఈ యాక్షన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి మిషన్ ఛాప్టర్ 1 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్ తో పాటు తెలుగు వెర్షన్ ను కూడా అందుబాటులోకి రానుంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే: మిషన్ చాప్టర్ 1 మూవీలో అరుణ్ విజయ్, అమీ జాక్సన్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు నిమిషా సజయన్, భరత్ భూపన్న, అభి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను రూపొందించారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోన్న తన కూతురుని కలుసుకోవడానికి జైలులో ఉన్న ఖైదీ ఎలాంటి పోరాటం చేశాడన్నదే మిషన్ ఛాప్టర్ 1 స్టోరీ. సినిమాలోని ఉత్కంఠభరితమైన మలుపులు, జైలు అధికారిగా అమీ జాక్సన్‌తో పోరాట సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.


Click it and Unblock the Notifications











