Anaganaga Oka Raju on OTT: ఓటీటీలో అనగనగా ఒక రాజు.. నవీన్ పొలిశెట్టి మూవీ ఎక్కడ చూడొచ్చంటే?
టాలీవుడ్‌లో యువ హీరో, హీరోయిన్లు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం అనగనగా ఒక రాజు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి తొలి చిత్ర దర్శకుడిగా మారి పరిచయమయ్యారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రంలో రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. వంశీ అట్టూరి ఎడిటర్‌గా, చిన్మయి సంభాషణలు అందించారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం జనవరి 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదలకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా మంచి బిజినెస్ కూడా సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి ఆట నుంచి భారీగా ఆదరణ పొందుతూ సంక్రాంతి రేసులో మంచి సక్సెస్ కూడా సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. ఈ మూవీ ఓటీటీ వివరాలకు వెళితే..

కామెడీ, లవ్, రూరల్ పొలిటికల్ డ్రామాగా రూపొందిన అనగనగా ఒక రాజు చిత్రాన్ని సుమారుగా 40 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్, నవీన్ పొలిశెట్టి ఇమేజ్ ప్లస్ పాయింట్స్‌గా మారడంతో సుమారుగా 30 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఆంధ్రా, నైజాం, సీడెడ్‌లో రికార్డు లాభాలను పంచిపెట్టింది. ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్ల మేర వసూలు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో దాదాపు 110 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు భారీ లాభాలను సంపాదించి పెట్టింది.
థియేట్రికల్‌గా భారీ లాభాలను, రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ముగించుకొని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
నెట్‌ఫ్లిక్స్ తెలిపిన ప్రకారం.. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన స్ట్రీమింగ్ కానున్నది. థియేట్రికల్‌గా మంచి ఫన్, కామెడీ, మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











