Baby OTT: 'బేబీ' లవర్స్ గెట్ రెడీ.. మరింత బోల్డ్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే?

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా రిలీజ్ అయి... సంచలనం సృష్టించిన సినిమా బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరి చిత్రం.. యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఎప్పుడెప్పుడూ ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న తరుణంలో బేబీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అంతే కాదు ఈ మూవీ ఓటీటీలో మరింత ఎక్కువ నిడివితో బోల్డ్ గా రానుంది. ఇక ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ఆశ్విన్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం బేబి. ఇక ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి సూపర్ హిట్టు టాక్ తో దూసుకెళ్లింది. ఇక కేవలం 10కోట్ల రూపాయలు కూడా పెట్టని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100కోట్ల కలెక్షన్లు సాధించే దిశగా పరుగులు పెడుతోంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరి.. యువతకు బాగా కనెక్టు అవ్వడం వల్ల ఈ మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చాయి.

Anand Devarakonda Baby 4 Hour Cut Movie Stream on Aha From Tomorrow

బేబీ చిత్రం జులై 14వ తేదీన రిలీజ్ అయింది. ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించారు. ఇక ఈమూవీకి విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం.. సినిమాకే ప్లస్ అని చెప్పవచ్చు. ఇప్పటికీ ప్రతి పాట యువతను ఆకట్టుకుంటోంది. ఇక ఈ మూవీ ఇప్పటికే ఓటీటీ వేదికగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ.. థియేటర్లలో రెస్పాన్స్ చూసి ఈ మూవీని ఓటీటీ విడుదల వాయిదా వేశారు.

అయితే తాజాగా బేబీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. ఆగస్టు మొదటి వారంలోనే ఈ మూవీ ఓటీటీ వేదికగా రిలీజ్ కావాల్సింది. అయితే బేబీ ఓటీటీ లవర్స్ కోసం చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. బేబీ మూవీని ఓటీటీలో నాలుగు గంటల నిడివితో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అంతే కాదు ఈ మూవీలో వైష్ణవి చైతన్య, విరాజ్ ఆశ్విన్ ల మధ్య మరింత బోల్డ్ సీన్స్ యాడ్ చేయనున్నారట.

Anand Devarakonda Baby 4 Hour Cut Movie Stream on Aha From Tomorrow

ఇక బేబీ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వాళ్ల అమ్మ మధ్య సెంటిమెంట్ సీన్స్ కూడా యాడ్ చేయనున్నారు. ఆగస్టు చివరివారంలో లేదా.. సెప్టెంబర్ మెుదటి వారంలో విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఆగస్టులోనే విడుదల కానుందని తెలుస్తోంది. రేపు అనగా ఆగస్టు 18వ తేదీ నుంచే ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కానుందని సమాచారం. అది కూడా గుండెలను పిండేయాలనే ఉద్దేశ్యంతో నాలుగు గంటల నిడివితో ఓటీటీలోకి రాబోతుంది ఈ మూవీ.

Anand Devarakonda Baby 4 Hour Cut Movie Stream on Aha From Tomorrow

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా బేబీ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఆగస్టు 18వ తేదీ నుంచి ప్రసారం కాబోతోందని తెలుస్తోంది. అయితే సమాచారం ప్రకారం థియేటర్స్‌లో సెన్సార్ బోర్డు కట్ చేసిన సీన్స్‌ను ఓటీటీలో విడుదల చేయనున్నారు. మొత్తానికి నాలుగు గంటల నిడివితో.. మరింత బోల్డ్‌గా మెప్పించేందుకు రెడీ అవుతోంది 'బేబి' చిత్రం. మీరు థియేటర్లలో చూసినా... మళ్లీ ఓటీటీలో ఓ సారి చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X