OTTలో రచ్చరేపుతున్న తెలుగు కల్ట్ బ్లాక్ బస్టర్... ఒక్కరోజుకే ఈ రేంజులోనా?
చిన్న సినిమాగా వచ్చి... పెను సంచలనం సృష్టించిన సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ థియేటర్లలో జులై 14వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇక రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి సూపర్ రెస్పాన్స్ తో అలరించింది. ఇక ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ రచ్చరేపుతోంది. మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఆ వివరాల్లోకి వెళితే....
సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం బేబీ. ఇక ఈ సినిమా థియేటర్లలో జులై 14 వ తేదీన రిలీజ్ అయింది. విడుదల అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని 10 కోట్ల రూపాయాలతో తెరెకెక్కించారు.

ఇక బేబీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. దాదాపు 100 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్టు 25 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఈ తెలుగు కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ ఉన్న వారికి 12 గంటల ముందే అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ.. ఆహా సబ్ స్క్రిప్షన్ వారికి ఆగస్టు25 అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది.

ఇక బేబీ చిత్రం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఈ సినిమా ఆహా ఓటీటీలో విడుదల అయిన 32 గంటలలోనే అత్యంత వేగంగా 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పొందినట్లు ఆహా ప్రకటించింది. బేబీ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ.... బేబీ సినిమా తీన్మార్ మ్రోగింది అంటూ కాప్షన్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక బేబీ చిత్రంలో వైష్ణవి నటన సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ మూవీ... వైష్ణవి తన క్యారెక్టర్ లో జీవించిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో ఈ భామకు టాలీవుడ్ లో మంచి పేరు వచ్చింది. తక్కువ బడ్జెట్ తో తీసినా కూడా కథ బాగుంటే.. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని బేబీ సినిమా నిరూపించింది.

ఇక బేబీ శాటిలైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని ప్రముఖ టీవీ ఛానలె ఈటీవీ రూ.4 కోట్లకు విక్రయించింది. అయితే ఈటీవీ.. కొత్త సినిమాలను కొనడంలో కాస్త వెనకంజలోనే ఉంటుంది. కానీ ఈ సారి బేబీని కొని షాకిచ్చింది. ఇక ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా టెలికాస్ట్ చేస్తారని సమాచారం. థియేటర్లలో, ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ఈ సినిమా బుల్లితెరపై ఏ రేంజులో టీఆర్పీ సాధిస్తోందో చూడాలి.


Click it and Unblock the Notifications











