Anand Deverakonda's Highway ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే..
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో యువ హీరో ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ జంటగా నటిస్తున్న చిత్రం హైవే. సైకాలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబైంది. ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. హైవే సినిమా ఓటీటీ రిలీజ్ వివరాల్లోకి వెళితే..

మిస్టీరియస్ పోస్టర్‌తో
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో హైవే సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే ముందు ఒక మిస్టీరియస్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైవే చిత్రం సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందించాం. ఈ సినిమాను డైరెక్ట్‌గా డిజిటల్ రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.

మిర్జాపూర్ నటుడు టాలీవుడ్‌లోకి
హైవే చిత్రం ద్వారా హిందీ నటుడు అభిషేక్ బెనర్జీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఓటీటీలో అద్భుతమైన రెస్సాన్స్, సక్సెస్‌ను అందుకొన్న మిర్జాపూర్,పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ ద్వారా అభిషేక్ బెనర్జీ భారీ పాపులారిటిని, అభిమానులను సంపాదించుకొన్నారు. ఈ చిత్రంలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

సీరియల్ కిల్లర్ నేపథ్యంలో
హైవే సినిమా విషయానికి వస్తే.. విష్ణు అనే ఫోటోగ్రాఫర్ తులసి అనే అమ్మాయితో లవ్‌లో పడుతాడు. తులసిని D అనే సీరియల్ కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు.సీరియల్ కిల్లర్ బారి నుంచి రక్షించుకొనే సమయంలో విష్ణు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ.

కేవీ గుహాన్ మూడో సినిమా
దక్షిణాదిలో పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్న మూడో సినిమా హైవే. 2019లో కల్యాణ్ రామ్ హీరోగా 118 సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మారారు. లాక్‌డౌన్‌లో WWW అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం కూడా సోనిలివ్‌లో నేరుగా రిలీజైంది.
Recommended Video


ఆగస్టు 19న ఆహాలో రిలీజ్
అయితే గుహన్ దర్శకత్వం వహించిన హైవేను ఆహా ఓటీటీలో ఆగస్టు 19వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సైమాన్కే కింగ్ మ్యూజిక్ అందిస్తున్నారు. వెంకట్ తలారీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











