Baby OTT: బేబి మూవీ ఆ ఓటీటీలోనే.. రిలీజైన అన్ని రోజులకే స్ట్రీమింగ్

విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా.. ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా సొంతం చేసుకోలేకపోయాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పటి వరకూ అతడు చేసిన మూవీలు సక్సెస్ కాకున్నా.. నటుడిగా మాత్రం మంచి పేరును తెచ్చుకుంటున్నాడు.

ఇలా సుదీర్ఘ కాలంగా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆనంద్ దేవరకొండ 'బేబి' అనే సినిమాను చేశాడు. విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ ప్రేమ కథా చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Anand Deverakonda Starrer Baby Movie Locks OTT Partner

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ తెరకెక్కించిన చిత్రమే 'బేబి'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అలాంటి టాక్‌ను సొంతం చేసుకుంది.

అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో అయితే దక్కుతోంది. తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ బాగున్నాయి. దీంతో దీనికి ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా 'బేబి' మూవీ ఓటీటీ డీల్‌కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

క్లిష్టమైన ప్రేమకథకు సమకాలీన అంశాలను జోడించి తెరకెక్కించిన 'బేబి' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం ఆహా సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది.

Anand Deverakonda Starrer Baby Movie Locks OTT Partner

అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని సమాచారం. అంటే జూలై 14న విడుదలైన 'బేబి' ఆగస్టు 3వ వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ వినిపిస్తోంది.

యూత్‌ఫుల్ మెసేజ్‌తో రూపొందిన 'బేబి' మూవీలో విరాజ్ అశ్విన్, నాగబాబు, వైవా హర్ష, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత కీలక పాత్రలను చేశారు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X