Baby OTT: బేబి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. వాళ్లకు మాత్రం 12 గంటల ముందే యాక్సెస్
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి యూత్‌కు కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీలతో మూవీలు పెద్దగా రావడం లేదు. దీంతో అలాంటి చిత్రాలను ఇష్టపడే వాళ్లంతా నిరాశ చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన యూత్‌ఫుల్ కాంటెంపరరీ లవ్ మూవీనే 'బేబి'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
'బేబి' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో అయితే దక్కుతోంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకూ ఈ మూవీ రూ. 43 కోట్లకు పైగా షేర్ రాబట్టడంతో పాటు రూ. 35 కోట్లు వరకూ లాభాలు అందుకుని ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.

థియేటర్లలో దాదాపు నెల రోజుల పాటు సందడి చేసిన 'బేబి' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకున్నట్లు ఎప్పుడో అధికారికంగా వెల్లడించారు. అయితే, ఈ సినిమాను మాత్రం ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తామన్న దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఓటీటీ డేట్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి.
క్లిష్టమైన ప్రేమకథతో తెరకెక్కించిన 'బేబి' మూవీని థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని ఓ న్యూస్ లీకైంది. అంటే జూలై 14న విడుదలైన 'బేబి' ఆగస్టు 3వ వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ వినిపించింది. అందుకు తగ్గట్లుగానే తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది.

యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో రూపొందిన 'బేబి' మూవీని ఆగస్టు 25 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, 'ఆహా గోల్డ్' సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లు ఈ సినిమాను 12 గంటల ముందే అంటే ఆగస్టు 24 నుంచే చూసేలా యాక్సెస్ ఇస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఇక, ఇందులో ఎడిటింగ్‌లో, సెన్సార్‌లో లేపేసిన సీన్స్‌ను కూడా యాడ్ చేసి ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

యూత్‌ఫుల్ మెసేజ్‌తో రూపొందిన 'బేబి' మూవీలో విరాజ్ అశ్విన్, నాగబాబు, వైవా హర్ష, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత కీలక పాత్రలను చేశారు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











