ఆ ఫేమస్ ఓటీటీలోనే గంగం గణేశా: ఏంటి అన్ని రోజులకే వచ్చేస్తుందా!
తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఈ మధ్య కాలంలో క్రైమ్ కామెడీతో కూడిన సబ్జెక్టులతో ఎన్నో రకాల చిత్రాలు రూపొందుతోన్నాయి. అలాంటి వాటికే ప్రేక్షకులు మంచి స్పందనను కూడా అందిస్తున్నారు. ఫలితంగా ఈ మూవీలు మంచి సక్సెస్‌లను సొంతం చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా రూపొందిన మరో క్రైమ్ కామెడీ సినిమానే 'గంగం గణేశా'.
చిన్న రౌడీ బాయ్ ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రమే 'గంగం గణేశా'. ఉదయ్ శెట్టి తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఫలితంగా ఎంతో హైప్ క్రియేట్ చేసుకుని ఆనంద్ దేవరకొండ చిత్రం గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గంగం గణేశా' సినిమా ఎన్నో అంచనాలతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మరో రెండు చిత్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ మొదటి రోజు మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్లను కూడా డీసెంట్‌గానే రాబట్టుకుంది.
కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'గంగం గణేశా' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతుండగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసిందట. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

టాలెంటెడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన 'గంగం గణేశా' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంటే మే 31వ తేదీన విడుదలైన ఈ చిత్రం జూలై మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. ఆనంద్ - ఉదయ్ శెట్టి కాంబోలో రూపొందిన 'గంగం గణేశా' మూవీని హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వంశీకృష్ణ కారుమంచి, కేదార్ సెలగం శెట్టి నిర్మించారు. ఇందులో నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్లుగా చేయగా.. ఇమాన్యూయేల్, ప్రిన్స్ యావర్‌లు నటించారు. చైతన్ భరద్వాజ్ దీనికి సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











