ఓటీటీలోకి చిన్న దేవరకొండ మూవీ.. నెల కూడా కాకుండానే ఎందులో వస్తుందంటే!

టాలీవుడ్‌లోని చాలా మంది స్టార్ హీరోలు తమ సోదరులను ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చారు. అలా హీరోగా పరిచయం అయిన వారిలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఒకడు. చాలా కాలం క్రితమే వచ్చిన అతడు.. గత చిత్రం 'బేబి'తో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఆనంద్ నటించిన సినిమానే 'గంగం గణేశా' (Gam Gam Ganesha).

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా సినిమానే 'గంగం గణేశా'. ఉదయ్ శెట్టి తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఫలితంగా ఎంతో హైప్ క్రియేట్ చేసుకుని ఆనంద్ దేవరకొండ నటించిన ఈ చిత్రం మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Anand Deverakonda Starrer Gam Gam Ganesha Movie Streaming From June 28th

క్రైమ్ కామెడీ జోనర్‌లో రూపొందిన 'గంగం గణేశా' సినిమా ఎన్నో అంచనాలతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగానే మరో రెండు చిత్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ మొదటి రోజు మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఆ తర్వాత ఇది తేలిపోవడంతో అర్థాంతరంగా రన్ ముగించింది.

ఆనంద్ దేవరకొండ - ఉదయ్ శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన 'గంగం గణేశా' సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసిందట. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పటి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌పై ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

Anand Deverakonda Starrer Gam Gam Ganesha Movie Streaming From June 28th

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన 'గంగం గణేశా' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని జూన్ 28వ తేదీ నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గంగం గణేశా' మూవీని హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వంశీకృష్ణ కారుమంచి, కేదార్ సెలగం శెట్టి నిర్మించారు. ఇందులో నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్లుగా చేయగా.. ఇమాన్యూయేల్, ప్రిన్స్ యావర్‌లు నటించారు. చైతన్ భరద్వాజ్ దీనికి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X