సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన రీసెంట్ రొమాంటిక్ థ్రిల్లర్.. సీన్ సీన్‌కు సర్‌ప్రైజ్, ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో హార్రర్, థ్రిల్లర్ సినిమాల హవా బాగా పెరిగిపోయింది. అందరూ ఇలాంటి చిత్రాలు చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకున్న దర్శకనిర్మాతలు కూడా అలాంటి చిత్రాలతోనే వస్తూ సూపర్ హిట్ లు కొడుతున్నారు. అయితే 5 నెలల క్రితం విడుదల అయిన ఓ సర్ ప్రైజింగ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఓటీటీలో అనేక థ్రిల్లర్ చిత్రాలు ఉండగా.. ఇది కూడా వచ్చి మరింత థ్రిల్ ఇవ్వబోతుంది. అయితే ఈ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గతేడాది నవంబర్ లో విడుదల అయిన రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాయే అన్వేషి. టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అనన్య నాగళ్ల ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా నవంబర్ 17వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమా థియేటర్ల వద్ద వసూళ్లను రాబట్టలేకపోయింది. కానీ కథ చూపించిన విధానం.. ఫర్వాలేదనిపించింది.

Ananya Nagalla Recent Romantic Thriller Anveshi Movie OTT Streaming Details here

అనన్య నాగళ్లతో పాటు ఈ సినిమాలో సిమ్రాన్ గుప్తా, అజయ్ ఘోష్, విజయ్ ధరణ్ దాట్ల, పుష్పక్ రమేష్, రచ్చ రవి, దిల్ రమేష్, విద్యాసాగర్ రాజు, జబర్దస్త్ ఇమాన్యుయేల్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో కనిపించి మెస్మరైజ్ చేశారు. అరుణ శ్రీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై టి. గ‌ణ‌ప‌తి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వీ.జే. ఖన్నా దర్శకత్వం వహించారు. అలాగే చైతన్య భరద్వాజ్ సంగీతం అందించగా.. కెకె రావు సినిమాటోగ్రఫీ పనులను చూసుకున్నారు. కార్తీక శ్రీనివాస ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు.

రొమాంటిక్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ అన్వేషి సినిమా థియేటర్లలోకి వచ్చి 5 నెలలు అవుతుంది. అయితే ఇంతకాలం ఓటీటీ గురించి ఆలోచించని ఈ మూవీ టీం.. సడైన్ గా ఓ ప్రముఖ ఓటీటీలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయించారు. ముఖ్యంగా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా అన్వేషి చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

Ananya Nagalla Recent Romantic Thriller Anveshi Movie OTT Streaming Details here

అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో వచ్చిన థ్రిల్లర్ సినిమా ఇదే మొదటిది. రెండోది ఈరోజే థియేటర్లలోకి వచ్చిన తంత్ర. అయితే తంత్ర కంటే ముందుగా వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈరోజు నుంచే ఓటీటీలో సందడి చేస్తున్న ఈ సినిమా థ్రిల్లర్, రొమాంటిక్ చిత్రాలు ఇష్టపడే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిందే. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఇంట్లోనే కూర్చుని థ్రిల్ ఫీల్ అయ్యే ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X