ఓటీటీలోకి వణుకు పుట్టించే దెయ్యం సినిమా.. ఎందులో చూడాలో తెలుసా?
ఏ భాషలో అయినా మిగిలిన జోనర్ల కంటే దెయ్యం నేపథ్యంతో వచ్చే హర్రర్ సినిమాలకు కాసింత ఎక్కువ హైప్ క్రియేట్ అవుతుంది. వీటికి ప్రచార చిత్రాలు బాగుంటే భారీ అంచనాలు ఏర్పరచుకుంటూ ఉంటాయి. ఇలా ఈ మధ్య కాలంలో తెలుగులో ఎన్నో మూవీలు వచ్చాయి. ఇలా కొద్ది రోజుల క్రితమే ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చిన సినిమానే 'తంత్ర'.
అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'తంత్ర'. దెయ్యాలు, చేతబడులు వంటి అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను కూడా ఏర్పరచుకుంది.

క్రేజీ బజ్‌తో 'తంత్ర' మూవీ మార్చి 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, ఆరంభంలోనే ఈ సినిమాకు మంచి టాక్ రాలేదు. దీనికి కారణం ఇందులో పాయింట్ పర్‌ఫెక్ట్‌గా ఉన్నా.. దాన్ని నడిపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడమే అని చెప్పాలి. ఫలితంగా ఈ చిత్రం ఆశించిన రీతిలో విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.
దెయ్యం నేపథ్యంతో వెన్నులో వణుకు పుట్టించే స్టోరీ లైన్‌తో రూపొందిన మూవీ కావడంతో పాటు విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో 'తంత్ర' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి మంచి పోటీనే వచ్చినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను తెలుగు ఓటీటీ సంస్థ ఆహా మంచి ధరకు సొంతం చేసుకుంది.
యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల నటించిన 'తంత్ర' మూవీని ఆహా సంస్థ నెల రోజుల లోపే స్ట్రీమింగ్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఈ మేరకు తాజాగా సదరు సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీనికి ఓ క్రేజీ వీడియోను సైతం జోడించింది. ఇక, థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. అనన్య నాగళ్ల - శ్రీనివాస్ గోపిశెట్టి కాంబినేషన్‌లో రూపొందిన 'తంత్ర' చిత్రాన్ని నరేష్ బాబు, రవి చైతన్య సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని, మనోజ్ ముత్యం తదితరులు నటించారు. ఈ హర్రర్ మూవీకి ఆర్ఆర్ ధ్రువన్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











