Koffee with Karan 7 ఈ మధ్యసెక్స్ ఎప్పుడు చేశావు..కరణ్ జోహర్ ప్రశ్నకు అనన్య దిమ్మతిరిగే జవాబు
బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత, డిస్టిబ్యూటర్, హోస్ట్ కరణ్ జోహర్ ప్రారంభించిన కాఫీ విత్ కరణ్ షో సీజన్ 7 రంజుగా సాగుతున్నది. ఇటీవల ప్రారంభమైన ఈ షో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తున్నది. ప్రతీ గురువారం సాయంత్రం డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న తాజా సీజన్‌కు సంబంధించిన ఎపిసోడ్స్ కేక పుట్టిస్తున్నాయి. త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న కాఫీ విత్ కరణ్ 7 షోలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా కనిపించారు. ఈ షోలో కరణ్ అడిగిన ప్రశ్నలు వైరల్‌గా మారాయి. విజయ్ దేవరకొండ, అనన్యపాండే ఎలా సమాధానాలు చెప్పారంటే..

ఒకటి, రెండు ఎపిపోడ్స్‌లో
కాఫీ విత్ కరణ్ 7 సీజన్ క్రేజీగా ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌లో రణ్‌వీర్ సింగ్, ఆలియాభట్ జంటగా హాజరయ్యారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఇద్దరు బాలీవుడ్ సెలబ్రీటీలు కరణ్ అడిగిన ప్రశ్నలకు కేక పెట్టించారు. ఇక రెండో ఎపిసోడ్‌లో జాన్వీ కపూర్, సారా ఆలీ ఖాన్ జంటగా హాజరయ్యారు. జాన్వీ, సారా చెప్పిన విషయాలు వైరల్ అయ్యాయి. ఇక మూడో ఎపిసోడ్‌లో సమంత, అక్షయ్ కుమార్ చేసిన హంగామా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

నాలుగో ఎపిసోడ్‌లో లైగర్ జంట
ఇక కాఫీ విత్ కరణ్ 7 షోలో నాలుగో ఎపిసోడ్‌లో లైగర్ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ, అనన్య పాండేను కరణ్ జోహర్ గ్రాండ్‌గా ఆహ్వానించాడు. విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తూ.. నీకు చీజ్ (వెన్న) ఇష్టమా? కరణ్ జోహర్ అంటే.. ఈ ప్రశ్నకు సమాధానం చెబితే ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది అని సమాధానం ఇచ్చాడు. విజయ్ దేవరకొండకు చీజ్ ముక్కలంటే ఇష్టమని జాన్వీ కపూర్ గత ఎపిసోడ్‌లో చెప్పడం కనిపించింది.

ఆదిత్య రాయ్ కపూర్‌తో అంటూ
ఇక అనన్య పాండేను కరణ్ జోహర్ ప్రశ్నలతో ఆడుకొన్నారు. నేను ఇచ్చిన పార్టీలో నేను ఒకటి చూశాను అంటూ కరణ్ ఏదో చెప్పబోతుండగా..ఆపు.. ఆపు అంటూ అనన్య బతిమలాడింది. ఆ తర్వాత నీవు, ఆదిత్య రాయ్ కపూర్ మధ్య ఏదో జరిగింది. మీ మధ్య జరిగిన ఆ విషయం ఏమిటో అంటూ కరణ్ సీక్రెట్‌ను బయటపెట్టేందుకు ప్రయత్నించాడు.

అనన్యను ఇరుకున పెట్టేందుకు
అనన్య పాండేను కరణ్ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించినట్టు తాజా ప్రోమోలో స్పష్టంగా కనిపించింది. ఈ మధ్య కాలంలో నీవు ఎప్పుడు సెక్స్ చేశావు అని కరణ్ జోహర్ అడిగితే.. ఈ రోజు మార్నింగ్ నేను సెక్స్ చేశాను అంటూ అనన్య సమాధానం చెప్పింది. ఈ రోజేనా..ఈ రోజేనా అంటూ కరణ్ జోహర్ ఆటపట్టిస్తూ కనిపించాడు. అయితే అనన్య ఆ విషయాన్నిచాలా సింపుల్‌గా తీసుకొన్నట్టు కనిపించింది.

కారులోనే ఆ పని అంటూ విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండను కూడా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే కరణ్ ట్రాప్‌లో పడకుండా విజయ్ దేవరకొండ చాలా కామ్‌గా సమాధానాలు చెప్పాడు. బహిరంగ ప్రదేశంలో ఎప్పుడైనా మూత్రానికి వెళ్లావా? అంటే.. కారులో మూత్రం చేయాల్సి వచ్చింది అని విజయ్ దేవరకొండ సమాధానం చెప్పాడు. కారులోనా అదెలా సాధ్యం అంటే.. తప్పనిపరిస్థితుల్లో చేయకతప్పలేదు అని విజయ్ దేవరకొండ సమాధానం చెప్పాడు. ప్రోమోలోనే ఇలా హాట్ హాట్‌గా ఉంటే.. ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతున్నది.


Click it and Unblock the Notifications











