OTTలోకి సైలెంటుగా వచ్చేసిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్‌టైనర్‌... స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఓటీటీలోకి ప్రతివారం కొత్త కంటెంట్ తో పాటు... థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కూడా వస్తుంటాయి. ఇక ఓటీటీలోకి మరో సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్ వచ్చేసింది. కన్నడలో సూపర్ హిట్టుగా నిలిచిన హాస్ట‌ల్ హుదుగురు బెక‌గిద్దారే సినిమా తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఇక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

తెలుగు ప్రేక్షకులకు కంటెంట్ బాగుంటే... అది మన సినిమానా... వేరే లాంగ్వేజ్ సినిమానా అని చూడరు.. సూపర్ హిట్ చేసేస్తారు అంతే. ఇక ఇటీవల కన్నడ, మలయాళ, తమిళ సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కన్నడ సినిమాలు అంటే ఎవరు పట్టించుకునే వారు కాదు. ఇప్పుడు కేజీఎఫ్ రిలీజ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీకి బాగా గుర్తింపు వచ్చింది. ఇక అక్కడి సినిమాలు తెలుగులోనూ డబ్బింగ్ అవుతున్నాయి.

 Boys Hostel Movie

ఇక తాజాగా కన్నడంలో సూపర్ హిట్టుగా నిలిచిన హాస్ట‌ల్ హుదుగురు బెక‌గిద్దారే సినిమా తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో డబ్ చేశారు. ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కన్నడంలో జూలై 21వ తేదీన రిలీజ్ అయి సూపర్ హిట్టుగా నిలిచింది. సరిగ్గా నెల తర్వాత తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అయింది.

ఇక కన్నడంలో రిష‌బ్ శెట్టి, ర‌మ్య పోషించిన పాత్రలను తెలుగులో తరుణ్‌ భాస్కర్‌, రష్మీ గౌతమ్‌లతో రీషూట్ చేయించి రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీకి మరింత హైప్ వచ్చింది. తెలుగులో రిలీజ్ అయిన బాయ్స్ హాస్టల్... ఇక్కడి వారినికూడా అమితంగా ఆకట్టుకుంది. యూత్‌ ను థియేటర్లకు రప్పించిన బాయ్స్‌ హాస్టల్‌ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

బాయ్స్ హాస్టల్ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్ గా ఓటీటీలో ప్రత్యేక్షం అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5 బాయ్స్‌ హాస్టల్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను విక్రయించింది. ఇక ఈ సినిమా సడెన్ గా ఈ శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో సూపర్ హిట్టుగా నిలిచిన ఈ సినిమా... మరి ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టించనుందో చూడాలి.

 Boys Hostel Movie

ఇక బాయ్స్ హాస్టల్ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. తెలుగులో ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌ తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ కామెడీ ఎంటర్‌ టైనర్‌ ను రిలీజ్ చేశాయి. కాంతార, విరూపాక్ష సినిమాలకు స్వరాలు సమకూర్చిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు స్వరాలు అందించారు. మీరు కనుక ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయితే... ఓటీటీలో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X