Bigg Boss Non Stop ఇంటి కెప్టెన్‌గా ఆ కంటెస్టెంట్ ఏడోసారి సక్సెస్.. కానీ ఎలిమినేషన్ కత్తి వేటు తప్పించుకొంటాడ
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షో నాన్ స్టాప్ రసవత్తరంగా సాగుతున్నది. ఓటీటీలో 24 గంటలపాటు స్ట్రీమింగ్ అవుతున్న ఈ రియాలిటీ షో ఇప్పటికే సగం పూర్తయింది. అయితే ఏడోవారంలో కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగింది. పలు టాస్క్‌ల తర్వాత నలుగురిని కెప్టెన్సీ టాస్క్‌కు ఎంపిక చేశారు. కెప్టెన్సీ టాస్క్‌కు అర్హత సాధించిన వారిలో నటరాజ్ మాస్టర్, శివ, మహేష్ విట్టా, మిత్రా శర్మ, అనిల్ ఉన్నారు. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా రాక్ అండ్ రోల్ అనే టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చాడు. ఈ టాస్క్ వివరాల్లోకి వెళితే..

రాక్ అండ్ రోల్ టాస్క్‌లో
రాక్ అండ్ రోల్ టాస్క్‌లో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల దేహానికి ప్లాస్టిక్ టేప్‌తో చుట్టేస్తారు. దేహానికి చేతులు కట్టేసి.. కాళ్లకు కూడా ప్లాస్టిక్ టేప్‌ను చుట్టేసి కదలు కుండా చేస్తేస్తారు. అప్పుడు ఒకవైపు నుంచి మరోవైపుకు దొర్లుకుంటూ వెళ్లాలి. అలా వెళ్లి ఎలాంటి సహాయం లేకుండా నిలబడాలి. ఎవరైతే ముందుగా నిలబడుతారో.. వాళ్లు కెప్టెన్సీ టాస్క్ విజేతలుగా నిలుస్తారు అని బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు.

విజేతగా బిందు మాధవి
కెప్టెన్సీ టాస్క్ కోసం రాక్ అండ్ రోల్ టాస్క్ ఆసక్తికరంగా సాగింది. అందరూ దొర్లుకొంటూ గమ్యానికి చేరుకొన్నారు. కానీ నిలబడటంలో కంటెస్టెంట్లు అవస్థలు పడ్డారు. చివరకు యాంకర్ శివ నిలబడటంతో ఆయనను విజేతగా బిందుమాధవి ప్రకటించారు. దాంతో యాంకర్ శివ ప్రస్తుత వారానికి ఇంటికి కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఇంటి కెప్టెన్‌గా ఎన్నికైన యాంకర్ శివను బిగ్‌బాస్ అభినందించాడు.

ఆనందంలో యాంకర్ శివ
అయితే తాను కెప్టెన్‌గా ఎంపిక కావడంపై యాంకర్ శివ సంతోషంలో మునిగిపోయాడు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ మొదలైనప్పటి నుంచి ప్రతీ వారం యాంకర్ శివ కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొంటూనే ఉన్నాడు. కానీ ప్రతీసారి ఆ పదవి వెక్కరిస్తూ వేరే కంటెస్టెంట్‌ను వరించింది. అయితే ఈ సారి పట్టుదలగా ఆడి కెప్టెన్సీని శివ సాధించడం గమనార్హం.

మరోసారి కెప్టెన్ అవుతా అంటూ శివ
అయితే కెప్టెన్సీ హోదా రాగానే ఇంటిలో కెమెరా ముందు ఎమోషనల్ అయ్యాడు. కెప్టెన్సీ లేబుల్‌ను ముద్దు పెట్టుకొని సంబరపడిపోయాడు. ఎంతో కాలంగా తాను ఎదురు చూశాను. చివరకు ఈ వారం లభించింది అంటూ యాంకర్ శివ ఎమోషనల్ అయ్యాడు. అయితే బిందు మాధవితో మాట్లాడుతూ.. మరోసారి కూడా ఇంటికి కెప్టెన్ అవుతాను. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చివరి వారానికి కూడా కెప్టెన్ కావాలని ఉంది అని యాంకర్ శివ అనడం కనిపించింది.

యాంకర్ శివకు ఎలిమినేషన్ ముప్పు
ఇంటి కెప్టెన్‌గా ఎంపికైన యాంకర్ శివకు ఈ వారం ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కోబోతున్నాడు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న వారిలో మిత్రా శర్మ, అనిల్ రాథోడ్, అరియానా గ్లోరి, మహేష్ విట్టా, అఖిల్ సార్థక్, బిందు మాధవి, నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ ఉన్నాడు. ఈ వారం ఎలిమినేషన్ ముప్పు తప్పించుకొని కెప్టెన్‌గా సక్సెస్ అవుతాడా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











