Sreemukhi ఆ 58 ఏళ్ల నటుడే నా భర్త... యాంకర్ శ్రీముఖి షాకింగ్ కామెంట్స్
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ.. బుల్లితెరపై తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతే కాదు.. తన చలాకీ మాటలతో ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ వస్తుంది. అయితే ఈ భామ వెండితెరపై కూడా కనిపిస్తూ.. మెప్పిస్తుంది. తాజాగా కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఎపిసోడ్ లో తన భర్త గురించి చెప్పి షాక్ ఇచ్చింది. 58ఏళ్ల నటుడు తన భర్త అంటూ చెప్పుకువచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ తో నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
యాంకర్ శ్రీముఖి.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై బిజి బిజిగా గడుపుతుంది. సుమ తర్వాత ఆమె చేతిలో ఎక్కువ షోస్ ఉన్నాయి. ఇక అత్యంత క్రేజ్ ఉన్న యాంకర్ గా పరిశ్రమలో రాణిస్తుంది. తనకంటే సీనియర్లు అయిన సుమ, అనసూయ, రష్మిలను మించిపోతూ... అత్యధిక పారితోషికం అందుకుంటూ పలు ప్రోగ్రామ్స్ లకు యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక షోస్ పుల్ క్రేజ్, పాపులారిటినీ తెచ్చుకుంది.

ఇక శ్రీముఖి ఏదైనా ప్రోగ్రాం చేస్తుందంటే.. సగం రచ్చ ఆమేదే ఉంటుంది. అయితే తన పెళ్లి గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ న్యూ ఇయర్ ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. కాబోయే భర్తను పరిచయం చేస్తుందంటూ వార్తలు రాగా.. మరో షాకింగ్ కామెంట్స్ చేసింది. అందరికి షాకిస్తూ 58 ఏళ్ల నటుడిని పట్టుకుని మా ఆయన అంటూ ప్రకటించింది. ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న షోల్లో ఆహాలో ప్రసారం అయ్యే కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ షో కూడా ఒకటి. అనిల్ రావిపూడి జడ్జ్ గా ఈ షో రన్ అవుతుండగా... సగం జబర్దస్త్ కమెడియన్లు ఇందులో కామెడియన్లుగా ఉన్నారు. ఇది ఓ రకంగా జబర్దస్త్ కి పోటీగా ఓటీటీలో రన్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ షోకి ప్రతి వారం ఒకరు గెస్ట్ గా సందడి చేస్తుండగా.... తాజాగా కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు బ్రహ్మాజీ గెస్టుగా వచ్చి సందడి చేశారు.
బ్రహ్మాజీ ఎక్కడ ఉన్న కామెడి మాత్రం మిస్ అవ్వదు. అది ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా.. ప్రోగ్రామ్ అయినా.. సినిమా అయినా.. కామెడికి కొదువ ఉండదు. ఆయనపై వేసే పంచులు.. ఆయన వేసే పంచులు పేలుతూ ఉంటాయి. ఇక ఈ ప్రోగ్రాంకు వచ్చిన ఆయనపై అనిల్ రావిపూడి పంచ్ లు వేశారు. ఇక శ్రీముఖి కూడా బ్రహ్మాజీపై సెటైర్స్ వేసింది. బ్రహ్మాజీ వస్తున్నాడని.. తెలిసి తన డ్రెస్ కట్ చేసుకుని వచ్చిందని చెప్పుకువచ్చింది.

అది షోలో స్టేజ్‌పై అందరి ముందు చూపించి... తన థైస్ కనిపించేలా డ్రెస్ కట్ చేసుకున్నట్టు చెప్పుకువచ్చింది. దీనికి బ్రహ్మాజీకి మైండ్ బ్లాక్ అయిపోగా... అనిల్ రావిపూడి షాక్ అయ్యాడు. ఆ తర్వాత భర్తలకు సంబంధించిన ఓ స్కిట్ ను వేశారు. అందులో ఇద్దరు తమ భర్త గురించి మాట్లాడుకుంటుడగా.. దీంతో మా ఆయన డొల్లా కాదు, ఇంతకి మా ఆయన ఎవరో తెలుసా? అంటూ శ్రీముఖి కామెంట్స్ చేసింది. బ్రహ్మాజీనే మా అయాన అంటూ చెప్పుకువచ్చింది. బ్రహ్మాజీ సైతం సిగ్గు పడిపోయాడు. ఇది ఆద్యంతం నవ్వులు పూయించింది కానీ... దీనిపై నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ఈ షో జనవరి 6న ఆహాలో స్ట్రీమింగ్ అవనుంది.


Click it and Unblock the Notifications











