Inaya Sultana: పాపం ఇనయా సుల్తానా.. స్టేజీపై పరువు గోవిందా.. శ్రీముఖి అన్న మాటతో అలా!
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ద్వారా పాపులర్ అయిన మరో బ్యూటి ఇనయా సుల్తానా. ఓ పార్టీలో ఇనయా సుల్తానాతో ఎలా పడితే అలా రామ్ గోపాల్ వర్మ చిందులు వేయడంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. దీంతో ఇనయా సుల్తానాకు బిగ్ బాస్ తెలుగు 6లో పాల్గొనే అవకాశం లభించింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఎంటరైన ఇనయా అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని లేడీ టైగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల బిగ్ బాస్ ఆరో సీజన్ పూర్తయ్యాక బీబీ జోడీ అనే రియాలిటీ డ్యాన్స్ షోను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఇనయా కూడా పార్టిస్ పేట్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఇనయాపై యాంకర్ శ్రీముఖి షాకింగ్ కామెంట్స్ చేసింది.

బీబీ జోడి డ్యాన్స్ షో..
సెలబ్రిటీ షో గా ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షోలో మొదట్లో సెలబ్రిటీలే ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సీజన్ లు పెరిగినకొద్ది.. సీరియల్ నటినటులు, సోషల్ మీడియా స్టార్స్, రివ్యూవర్స్, యాంకర్స్, జర్నలిస్ట్స్ ఇలా విభిన్న నైపుణ్యాలు కలిగిన వ్యక్తులను కంటెస్టెంట్లుగా తీసుకొచ్చారు. ఇక వాళ్లందరు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాక ఉదయం పూట డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంటారు. ఈ కంటెస్టెంట్లలో ఎంతోమంది డ్యాన్సర్స్ ఉన్నారు. వారందరిచేత బీబీ జోడీలో డ్యాన్స్ చేయిస్తున్నారు.

యాంకర్ గా బుల్లితెర రాములమ్మ..
బీబీ జోడీ డ్యాన్స్ షోలో జోడీలుగా అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్విని, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-ఇనయా సుల్తానా, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్, అవినాష్-అరియానా, మెహబూబ్-అషు రెడ్డి ఉన్నారు. వీరందరికి యాంకర్ గా బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి వ్యవహరించనుంది. అలాగే న్యాయ నిర్ణేతలుగా అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు బ్యూటిఫుల్ హీరోయిన్ సదా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టార్ కొనసాగనున్నారు.

శ్రీముఖి ఫొటోలు వైరల్..
బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో నిర్వహిస్తున్న ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోను ప్రతి శని, ఆది వారాల్లో ప్రసారం చేస్తున్నారు. తాజాగా ఈ గత ఎపిసోడ్ లో జబర్దస్త్ ఫైమాతో ఇనయా సుల్తానాకు జరిగిన మాటల యుద్ధానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో బీబీ జోడీ టైటిల్ సాంగ్ ను పాడుకుంటూ రోల్ రైడా వస్తాడు. రోల్ రైడా పాటకు అనుగుణంగా మిగతా జోడీలు కూర్చుని స్టెప్పులు వేస్తాయి.

రాగానే లుక్ అటు పడిందా..
తర్వాత చాలా బాగుంది నాన్నా.. కానీ ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్. నువ్ ఇంకా ర్యాపింగ్ వదల్లేదా అని రోల్ రైడాకు యాంకర్ శ్రీముఖి పంచ్ వేసింది. తర్వాత రోల్ రైడాకి జోడీ ఎవరని అడగ్గా.. ఇనయా సుల్తానా ఎంట్రీ ఇచ్చింది. ఇనయా వస్తూనే ఆర్జే సూర్య వైపు చూసింది. దీంతో ఓ.. రాగానే లుక్ అటు పడిందా అని శ్రీముఖి అంది. తర్వాత ఏంట్రా సూర్య నేను రావడం ఒక్కవారం లేట్ కాగానే ఆ పొట్టి దాంతో జత కట్టేసావా అని అంది అరియానా. దీంతో ఫైమాతోపాటు మిగతా జోడీలు షాక్ తో అరిచారు.

ఫైమా పక్కన ఉండగా..
బ్యాటిల్ అయినా టైటిల్ అయినా నేను దిగనంతవరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్ ఎవ్రీథింగ్ ఈజ్ మైన్ అని ఇనయా డైలాగ్ కొట్టింది. ఈ ఫైమా పక్కన ఉండగా సూర్యకు ధమ్కీ ఇస్తున్నావా. నువ్ భయపెడితే భయపడి పారిపోవడానికి ఒంటిపై దోమను అనుకున్నావా.. ఫైమారా అని ఫైమా కౌంటర్ ఇచ్చింది. ఇలా వీళ్లిద్దరు కొద్దిసేపు మాటలతో యుద్ధం చేసుకుంటారు. ఇంతలో వాళ్లను ఆపుతుంది యాంకర్ శ్రీముఖి.

సూర్య పేరు వచ్చిందేంటి..
రోల్ రైడాతో ఇనయా గురించి మాట్లాడుతూ శ్రీముఖి.. కాదురా మొన్న మొన్ననే వచ్చింది.. మరి డ్యాన్స్ ఏమైనా చేస్తదంటావా లేకపోతే అసలు సూర్య పిచ్చిలో ఉందంటావా అని అనేసింది. దీంతో షాక్ అయి శ్రీముఖిని చూస్తుంది ఇనయా సుల్తానా. అయితే శ్రీముఖి అలా అనడంతో ఇనయా కొంచేం డిసప్పాయింట్ అయినట్లు కనిపించింది. తర్వాత కూడా డ్యాన్స్ పర్ఫామ్ చూద్దాం అంటూ శ్రీముఖి చెబుతూ.. ఏంటీ సూర్య పేరు వచ్చిందేంటి అని నాలుక కరుచుకుంది శ్రీముఖి. ఇలా స్టేజీపై ఇనయా సుల్తానా పరువు పోయినట్లుగా అయింది.


Click it and Unblock the Notifications











