OTTలోకి రొమాంటిక్ యూత్ ఎంటర్టైనర్... ఎందులో చూడాలంటే?
యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళీ అయినా సరే తనదైన తెలుగు ఉచ్చారణతో ఆమె తెలుగు ప్రేక్షకులు అందరికీ బాగా దగ్గర అయిపోయింది. రాజీవ్ కనకాల భార్యగా, దేవదాసు కనకాల కోడలిగా ఆమె తెలుగు ప్రేక్షకులకు ముందు పరిచయం అయినా సరే... తర్వాత మాత్రం ప్రతి తెలుగు ఇంటికి ఆడపడుచు లాగా ఆమె యాంకరింగ్ చేస్తూ ప్రతి ఒక్కరికి దగ్గర అయింది. అలాంటి ఆమె కుమారుడు హీరోగా పరిచయం అవుతూ చేసిన సినిమా బబుల్ గమ్. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. ఆ వివరాల్లోకి వెళితే
సినీ నటులు ఇతర టెక్నీషియన్ల కుమారులు హీరోలుగా... ఇతర టెక్నీషియన్లుగా సినీ రంగంలో ప్రవేశించడం చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటి తరుణంలోనే యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల కూడా హీరోగా పరిచయమవుతూ ఒక సినిమా చేశాడు. బబుల్ గమ్ పేరుతో ఆయన చేసిన ఒక సినిమా ఈ మధ్యనే ధియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

బబుల్ గమ్ సినిమాలో రోషన్ సరసన మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమా అయినప్పటికీ రోషన్ ఈ సినిమాలో రొమాన్స్ బాగానే చేశారనే కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమాని రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిగా... మహేశ్వరి మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో రిలీజ్ అయింది కానీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధం అయిపోయింది.
బబుల్ గమ్ సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆహా వీడియోలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆహా యాప్ లో ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... ఆసక్తికరంగా ఈ సినిమా సాగుతుంది.

ఆదిత్య అనే ఒక పాత బస్తీకి చెందిన కుర్రాడు జూబ్లీహిల్స్ కి చెందిన బాగా రిచ్ అయిన జాన్వీతో ప్రేమలో పడతాడు. అయితే ఈ తరం కుర్ర కారు లాగానే వారిద్దరి మధ్య చిన్న చిన్నగా మొదలైన గొడవలు పెద్ద యుద్ధాలకు కారణం అవుతాయి. వివాహం కూడా చేసుకోవాలనుకున్న వీరు చివరికి విడిపోయి ఎవరికి వారు గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
చివరికి వీరిద్దరూ వివాహం చేసుకున్నారా లేదా అనే ఆసక్తికరమైన యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు రవికాంత్ పేరేపు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలో వచ్చేస్తుండటంతో సినిమాని థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు. మీరు ఈ సినిమా థియేటర్లలో చూసారా లేక ఓటీటీలో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారా అనే విషయం కింద కామెంట్ చేయండి.


Click it and Unblock the Notifications











