Suma: యాంకర్ సుమకు బంపర్ ఆఫర్.. ప్రాజెక్ట్ K లో టాప్ యాంకర్

తెలుగు సినిమా పరిశ్రమలో టాలెంట్, సమయస్పూర్తి, హార్డ్ వర్క్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొంటున్న వారిలో యాంకర్ సుమ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆమె యాంకర్ గానే కాకుండా నటిగా, నిర్మాతగా, ఈవెంట్లకు హోస్టుగా, టెలివిజన్ రంగంలో విభిన్న రకాల పాత్రలతో రెండు దశాబ్దకాలానికిపైగా రాణిస్తున్నారు. ఇప్పటికీ అలుపు సొలుపు లేకుండా ఫుల్ ఎనర్జీతో టీవీ షోలు, సినిమా ఈవెంట్లతో బిజీగా ఉన్నారు. అయితే నిత్యం ఫుల్లు బిజీగా ఉండే సుమ నుంచి ఓటీటీలో ఓ టాక్ షో రాబోతున్నది. ఆ షోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సినిమా ప్రీ రిలీజ్, ఇతర ఈవెంట్లతో యాంకర్ సుమ బిజీగా ఉంటారు. ఇండస్ట్రీలో ఓ రేంజ్ హీరోయిన్లకు సమానంగా రెమ్యునరేషన్ అందుకొంటున్న వారిలో ఒకరు. అలాగే సొంత ప్రొడక్షన్‌లో ఆమె నిర్మాతగా కొన్ని టెలివిజన్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. అలా చేతి నిండా పనితో ఆమె క్షణం తీరిక లేకుండా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆమె మరో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Anchor Suma to host Chef Mantra Project K on AHA OTT

ఇప్పటి వరకు టెలివిజన్, సినీ రంగాలకే పరిమితమైన సుమ ప్రస్తుతం డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఓటీటీలో వంటల కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K అనే కార్యక్రమంతో కొత్త పాత్రను పోషించనున్నారు. వంటల కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఆమె సరికొత్తగా కనిపించబోతున్నారు అని ఆహా ఓటీటీ తాజాగా ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

ప్రాజెక్టు కే ప్రోగ్రాంలో రుచికరమైన వంటలను పరిచయం చేయనున్నారు. తనదైన శైలిలో నవిస్తూ, గేమ్స్ ఆడిస్తూ కిచెన్‌లో సరదా సరదాగా కబుర్లు చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు జోడిలను పరిచయం చేయనున్నారు. అలాగే మీకు వంటలపై ఆసక్తి ఉంటే.. వాటికి సంబంధించిన చిట్కాలను వెల్లడించేందుకు రెడీ అవుతున్నారు.

Anchor Suma to host Chef Mantra Project K on AHA OTT

యాంకర్ సుమ స్టయిల్‌లో విభిన్నమైన కార్యక్రమాన్ని అందించేందుకు ఆహా ఓటీటీ ప్రయత్నం చేస్తున్నది. ఇంతకు ముందు పలువురు హీరోయిన్లు, యాంకర్లతో మెప్పించలేకపోయిన కార్యక్రమాలకు భిన్నంగా ఈ షో ఉండబోతుందనే గ్యారెంటీ ఇచ్చేలా ప్రకటన జారీ చేశారు. అయితే చెఫ్ మంత్ర ప్రాజెక్టు K ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకొంటారా లేదా వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: anchor suma aha ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X