Andhra King Taluka OTT: ఆంధ్రా కింగ్ తాలుకా ఓటీటీ రిలీజ్.. రామ్ పోతినేని మూవీ స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై పాపులర్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలుకా. ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు పీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, యువ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
రొమాంటిక్ లవ్ స్టోరి, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు సిద్దార్థ నూని సినిమాటోగ్రఫిని, వివేక్- మెర్విన్ మ్యూజిక్ ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు.ఈ చిత్రం నవంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది.

ఆంధ్రా కింగ్ సినిమా కథ విషయానికి వస్తే.. తెలుగు సినిమా పరిశ్రమలో ఆంధ్రా కింగ్ అని ముద్దుగా పిలుచుకొనే సినీ హీరో సూర్య కుమార్ (ఊపేంద్ర)ను సాగర్ (రామ్ పోతినేని) అనే యువకుడు పిచ్చిగా ఆరాధిస్తాడు. పాలిటెక్నిక్ చదివే సాగర్ తన అభిమాన నటుడి కోసం ఏం త్యాగం చేశాడు? తాను అభిమానించిన హీరో ప్రభావంతో సాగర్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? తన కోసం జీవితాన్ని త్యాగం చేసిన సాగర్ కోసం హీరో సూర్య కుమార్ ఏం చేశాడు? మహాలక్ష్మీ (భాగ్యశ్రీ)తో సాగర్ ప్రేమ వ్యవహారం ఎలా సాగింది అనేది ఈ మూవీ కథ.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం ఆరంభంలో భారీ కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత అదే జోష్‌ను కొనసాగించకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయింది. ఈ చిత్రం సుమారుగా 28 కోట్ల రూపాయల షేర్ లక్ష్యంగా వసూళ్ల యాత్రను మొదలుపెట్టింది.
ఈ చిత్రం గత రెండు వారాల్లో ఇండియాలో 25.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, ఓవర్సీస్‌లో 4.75 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 30.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. అయితే ఈ సినిమా థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ సాధించలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్‌ను ముగించుకొని ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రానికి ఫ్యాన్సీ రేటు చెల్లించి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకొన్నది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతా ప్లాన్ ప్రకారం, నిర్మాతలతో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి


Click it and Unblock the Notifications











