Andhra King Taluka OTT: ఆంధ్రా కింగ్ తాలూకా ఏ ఓటీటీలో? రామ్ పోతినేని మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

గడిచిన ఆరేళ్లుగా సరైన హిట్ లేక కిందా మీద పడుతున్న రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. మహేశ్ బాబు పాచిగోళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషించారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి ఈ ఆంధ్రా తాలూకా సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్‌ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. వివేక్- మెర్విన్‌లు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.

ఆంధ్రా కింగ్ తాలూకా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రింట్స్, ప్రమోషనల్ ఇతర ఖర్చులన్నీ కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాను 70 కోట్ల రూపాయలతో నిర్మించినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్లు, పాటలతో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఆంధ్రా కింత్ తాలూకాపై మంచి హైప్ క్రియేటైంది. దాంతో రామ్ పోతినేని సినిమాకు ప్రీ బిజినెస్ కూడా బాగానే జరిగింది అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారాన్ని బట్టి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు వరల్డ్ వైడ్‌గా దాదాపు 27 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం 30 కోట్ల రూపాయల షేర్, 60 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Andhra King Taluka OTT Release When And Where To Watch Ram Pothineni s Movie Online After Theatrical Run

ఆంధ్రా కింగ్ తాలూకా కలెక్షన్స్
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌ ఆడియన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌ ఓ రేంజ్‌లో జరిగింది. రిలీజ్‌కు ముందే అక్కడ సాలీడ్ వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ 27వ తేదీ ఉదయం నాటికి అందుతున్న సమాచారం ప్రకారం ప్రీమియర్స్ ద్వారా రామ్ పోతినేని సినిమాకు మంచి వసూళ్లు వచ్చినట్లు ఫిలింనగర్ టాక్. అమెరికాలో 211 లోకేషన్స్‌కు గాను 412 షోలు పడ్డాయి. మొత్తం 5908 టికెట్స్ అమ్ముడయ్యాయి. తద్వారా 83,895 రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఫైనల్ లెక్కలు బయటికి వచ్చేనాటికి ఇది 150K డాలర్లు (భారత కరెన్సీలో 1.33 కోట్ల రూపాయలు) వసూలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది రామ్ పోతినేని కెరీర్‌లోనే యూఎస్ఏలో ఒక ప్రీమియర్ షోకి వచ్చిన అత్యధిక మొత్తంగా చెబుతున్నారు. అమెరికాలో రిపోర్ట్స్ నేపథ్యంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ భోర్సేతో పాటు ఇతర యూనిట్ సభ్యులు నార్త్ అమెరికాలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఆంధ్రా కింగ్ తాలూకా ఏ ఓటీటీలో?
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే ఇది ఎంత అన్నది మాత్రం తెలియరాలేదు. థియేటర్‌లో విడుదలైన 4 వారాలకు ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిబంధన మేరకు డీల్ కుదిరింది. దీని ప్రకారం డిసెంబర్ చివరివారంలో ఆంధ్రా కింగ్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ముందుగా జరగొచ్చు లేదంటే ఆలస్యంగానైనా ఓటీటీలోకి రావొచ్చు. ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్‌పై నెట్‌ఫ్లిక్స్‌ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X