OTTలోకి మరో మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. వెన్నులో వణుకుపుట్టించే దీన్ని ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య ఎక్కువగా హార్రర్, థ్రిల్లర్ చిత్రాలతో పాటు కామెడీ సినిమాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లు అనే తేడా లేకుండా అదిరిపోయే కంటెంట్ తో వస్తున్న వీటికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది. ఆ విషయం అర్థం చేసుకున్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా అలాంటి కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఆండ్రూ స్కాట్, జానీ ఫ్లైన్ వంటి వాళ్లు ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ను ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ఏంటి, దాన్ని ఎక్కడ స్ట్రీమింగ్ చేస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "రిప్లీ" అనే వెబ్ సిరీస్ ను 1955లో వచ్చిన క్రైమ్ నవల ది టాలెంటెడ్ మిస్టర్ రిప్లే ఆధారంగా తెరకెక్కించారు. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో ఆండ్రూ స్కాట్, డిక్కీ గ్రీన్‌లీఫ్‌గా జానీ ఫ్లిన్ మరియు మార్జ్ షేర్‌వుడ్‌గా డకోటా ఫానింగ్ నటించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల పరిమిత సిరీస్‌ను స్టీవెన్ జైలియన్ రూపొందించారు. రిప్లీ వెబ్ సిరీస్ ను షఓ టైమ్ లో ప్రసారం చేయాలని తెరకెక్కించారు. కానీ 2023 ఫిబ్రవరి నెలలో ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.

అలా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందిన నెట్ ఫ్లిక్స్.. ఈ వెబ్ సిరీస్ ను చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఏప్రిల్ 4వ తేదీ నుంచి అంటే గురువారం రోజు నుంచే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. వీలు దొరికినప్పుడుల్లా ఈ సిరీస్ ను చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ కథ ఏంటంటే... 1960వ దశకంలో న్యూయార్క్‌లోని దారి తప్పిన తన కొడుకును తిరిగి ఇటలీకి తీసుకు వచ్చేందుకు టామ్ రిప్లీ చేసే ప్రయత్నాలను చూపిస్తారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్నఈ వెబ్ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది. ముఖ్యంగా చివరి వరకు ఫుల్ థ్రిల్ ఇస్తూ.. కొనసాగుతుంది. అద్భుతమైన కథాంశంతో వచ్చి అనుక్షణం.. ప్రేక్షకులను వణికిస్తుంది. మరి థ్రిల్లర్, హార్రర్ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఎవరైనా సరే వెంటనే ఈ వెబ్ సిరీస్ ను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయేండి.


Click it and Unblock the Notifications











