Anger Tales Trailer review.. సినిమా దెXగితే.. సుహాస్ ఫ్యాన్ వార్.. బిగ్‌బాస్ బిందుమాధవి క్రేజీగా..!
ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ బిందుమాధవి, యువ నటుడు సుహాస్ నటించిన యాంగర్ టేల్స్ వెబ్ సిరీస్ మార్చి 9వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. యువ దర్శకులు తరుణ్ భాస్కర్, వెంకటేష్ మహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఢిస్నీ+హాట్ స్టార్‌లో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

నాలుగు జీవితాలు.. నాలుగు ఎపిసోడ్స్
యాంగర్ టేల్స్ సినిమా విషయానికి వస్తే.. నాలుగు జీవితాల్లో జరిగిన వివిధ సంఘటనలు, నాలుగు ఎపిసోడ్స్‌గా స్ట్రీమింగ్ కాబోతున్నది. తరుణ్ భాస్కర్, మడోన్నా ఒక జంట, బిందు మాధవి జంట, వెంకటేష్ మహా, సుహాస్ మరో జంటగా, ఇంకా కొత్త నటీనటులు జంట కలిపి నాలుగు కథలుగా తెరకెక్కాయి.

బిందు మాధవికి అలాంటి కష్టాలు
బిందు మాధవి ఇరుగుపొరుగు వారితో పడే బాధలు, సినిమా హీరోల ఫ్యాన్స్ వార్ లాంటి అంశాలు ట్రైలర్‌లో ఆసక్తికరంగా కనిపించాయి. శాఖాహారులు ఉండే గేటెడ్ కమ్యూనిటీలో బాధలు సినిమా చూడాలనే క్యూరియాసిటిని క్రియేట్ చేశాయి. ఇంటి పక్క నుంచే ఆడవాళ్ల ఉప్పర్ మీటింగ్‌లు ఎలాంటి కష్టాలు తెచ్చిపెట్టాయనే పాత్రలో బిందు మాధవి నటించింది.

తరుణ్ భాస్కర్, మడొన్నా జంటగా
తరుణ్ భాస్కర్, మడొన్నా మధ్య దాంపత్య పరమైన అంశాలు, శాఖాహారం అనేది వారి కాపురంలో పెద్ద ఇష్యూగా కనిపించింది. నాన్ వెజ్ తినేవారంతా చచ్చి పోతున్నారా? అంటూ ప్రశ్నించడం వెజ్, నాన్ వెజ్ అనే రెండు విషయాలపై భారీగానే చర్చ జరిగినట్టు ట్రైలర్ స్పష్టం చేసింది.

వెంకటేష్ మహా, సుహాస్ ఫ్యాన్ వార్
ఇక దర్శకుడు వెంకటేష్ మహా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఓ హీరోకు ఫ్యాన్‌గా వెంకటేష్ మహా, మరో హీరోకు ఫ్యాన్‌గా సుహాస్ నటిస్తున్నారనే విషయం ట్రైలర్‌లో స్పష్టమైంది. ఇక స్పెషల్ షోల గందరగోళం సుహాస్, వెంకటేష్ మహా మరో ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా కనిపించింది. వెంకటేష్ మహాతో సినిమా దెంగితే అంటూ సుహాస్ రెచ్చగొడుతూ చెప్పిన డైలాగ్స్ కథలోని ఇంటెన్సిటిని తెలియజెప్పింది. అలాగే వెంకటేష్ భుజాన్ని తడుతూ సుహాస్ చూపించిన బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంది.
యాంగర్ టేల్స్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: మడోన్నా సెబాస్టియన్, సుహాస్, బిందు మాధవి, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా, ఫణి ఆచార్య, తరుణ్ భాస్కర్ తదితరులు
దర్శకత్వం: ప్రభాలా తిలక్
నిర్మాతలు: శ్రీధర్ రెడ్డి, సుహాస్
సహ నిర్మాత: కృష్ణమ్ గడసు
రచన: కార్తీకేయ కారేడ్ల, ప్రభాకర్ తిలక్
సినిమాటోగ్రఫి: అమర్ దీప్, వినోద్ కే బంగారి, వెంకటేష్ శాఖమూరి, ఏజే ఆరోన్
మ్యూజిక్: స్మరణ్ సాయి
ఓటీటీ రిలీజ్: ఢిస్నీ+హాట్ స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-03-09


Click it and Unblock the Notifications











