Butta Bomma OTT: ఆ ఓటీటీలో బుట్టబొమ్మ.. ఆ సీన్స్ కూడా యాడ్ చేసి!

ఈ మధ్య కాలంలో పల్లెటూరి నేపథ్యంతో సాగే ప్రేమకథా చిత్రాలు పెద్దగా రావడం లేదు. దీంతో ఆ తరహా సినిమాల కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే పక్కా గ్రామీణ వాతావరణంతో సాగే ప్రేమకథతో రూపొందిన చిత్రమే 'బుట్టబొమ్మ'. మలయాళంలో రూపొంది సూపర్ డూపర్ హిట్ అయిన 'కప్పేల' అనే చిత్రానికి ఇది రీమేక్‌గా వచ్చింది. దీంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. తద్వారా భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చైల్డ్ ఆర్టిస్టుగా సత్తా చాటి హీరోయిన్‌గా మారిన అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమే 'బుట్టబొమ్మ'. శౌరీ చంద్రశేఖర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. దర్శక నిర్మాతల నమ్మకాన్ని నిలబెడుతూ ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే మంచి టాక్ వచ్చింది. కానీ, ఆ తర్వాత ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన రీతిలో స్పందన మాత్రం దక్కలేదు. ఫలితంగా దీనికి కలెక్షన్లు కూడా అంతగా రాలేదు. దీంతో 'బుట్టబొమ్మ' మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.

Anikha Surendran Butta Bomma Movie Streaming on Netflix from March 4th

ఇక, థియేటర్లలో అంతగా సందడి చేయలేకపోయిన 'బుట్టబొమ్మ' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీని విడుదలైన నెల రోజులకు అంటే మార్చి 4వ తేదీ నుంచే నెట్‌ఫ్లిక్స్‌ సంస్థలో స్ట్రీమింగ్ చేయబోతున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా అధికారికంగా రాబోతుందని సమాచారం. ఇక, దీన్ని సెన్సార్ లేకుండానే స్ట్రీమింగ్ చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులంతా నెట్‌ఫ్లిక్స్‌లో దీన్ని చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమే 'బుట్టబొమ్మ'. శౌరీ చంద్రశేఖర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో నవ్య స్వామీ, పుష్ప జగదీష్ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X