twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Anil Ravipudi: స్టేజ్ పై డైరెక్టర్ కామెడీ స్కిట్.. కమెడియన్ లకే మాస్టారు వంటి పర్ఫామెన్స్

    |

    ఇప్పటికీ బుల్లితెరపై కామేడీ షోలు తెగ సందడి చేశాయి. అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో తెలుగు ఓటీటీ వేదికగా ప్రేక్షకులు మన్ననలు పొందుతోంది ఆహా. సరికొత్త కాన్సెప్ట్స్ తో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే కామెడీ షోను స్టార్ట్ చేసింది. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ పేరుతో బుల్లితెరపై కమెడియన్లతో నవ్వులు పంచనుంది. ఈ షోకి న్యాయ నిర్ణేతగా, షోకి ఛైర్మన్ గా కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు అయిన అనిల్ రావిపూడి వ్యవహరించనున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది ఆహా.

    స్టాక్స్ గా కమెడియన్స్..

    స్టాక్స్ గా కమెడియన్స్..

    ఆహా ఓటీటీ వేదిక అందిస్తున్న సరికొత్త కామెడీ ఎంటర్టైన్ మెంట్ షో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ షోకి ఛైర్మన్ గా సరిలేరు నీకెవ్వరు, F2, F3 చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్, దీపిక పిళ్లై యాంకర్స్ గా అలరించనున్నారు. ఇక సెలబ్రిటీ కమెడియన్స్ అయిన వేణు, అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ స్టాక్స్ గా ఉండనున్నారు.

    10 ఎపిసోడ్లతో కామెడీ షో..

    10 ఎపిసోడ్లతో కామెడీ షో..

    ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోలో మూడు రౌండ్స్ ఉండనున్నాయి. ఇందులో కమెడియన్స్ స్టాక్స్ గా ఉంటారు. అలాగే ఇన్వెస్టర్లుగా ఆడియెన్స్ ఉంటారు. అంటే స్టాక్స్ కు ఆడియెన్స్ ఓట్లు వేస్తారు. అక్కడ ఎక్కువ ఓట్లు గెలుచుకున్న వారు ఛైర్మన్ మనసు గెలుచుకుని టాప్ స్టాక్ గా పేరు తెచ్చుకుంటారు. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ షో 10 ఎపిసోడ్లుగా సాగనుంది. ఆహా వేదికగా డిసెంబర్ 2 నుంచి ప్రసారం కానుంది ఈ నవ్వుల షో.

     స్టేజిపై డైరెక్టర్ స్కిట్..

    స్టేజిపై డైరెక్టర్ స్కిట్..

    తాజాగా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది ఆహా. ముందుగా సుధీర్ అండ్ దీపికా డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత వాళ్లే (ఆడియెన్స్) మన ఇన్వెస్టర్స్, వీరు మన స్టాక్స్ (కమెడియన్స్) నేను మీ ఛైర్మన్ (అనిల్ రావిపూడి).. ఇదే మన కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అంటూ ప్రారంభించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తర్వాత స్టేజిపైన ఒక చిన్న కామెడీ స్కిట్ వేసి నవ్వించాడు అనిల్ రావిపూడి.

     స్కూళ్లో విద్యార్థుల రియాక్షన్స్..

    స్కూళ్లో విద్యార్థుల రియాక్షన్స్..

    స్కూల్లో మాస్టార్ కొడితే విద్యార్థులు ఇచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయో చేసి చూపించారు. మాస్టర్ కొట్టేటప్పుడు ఒక్కొక్కరి టాలెంట్ చూస్తే ఆస్కార్ ఇచ్చేయొచ్చు.. అంటే ఒక దెబ్బ కొడితే.. ఇంకో దెబ్బ కొట్టనీయకుండా పర్ఫామ్ చేస్తాడు అని చెప్పిన అనిల్ రావిపూడి అది ఎలాగో చేసి చూపించాడు. మొదటి దెబ్బకు రెండు కాళ్లలో చేతి పెట్టుకుని బాగా నొప్పిగా ఉన్నట్లు ఊగిపోయారు. తర్వాత మళ్లీ రెండు కాళ్లలో చేతులు పెట్టుకుని అటు ఇటు ఊగుతూ పర్ఫామెన్స్ ఇచ్చి కమెడియన్లే పగలబడి నవ్వేలా చేశారు.

    పీటీ సార్ లా సద్దాం కామెడీ..

    ఇంకొకరు ఉంటారు. వాళ్లకు బాగా ఇన్ ఫ్లూయెన్స్ ఉంటుంది. ఆ ఊర్లో కొద్దిగా బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడిని కొడితే ఎలా ఉంటుంది అని చెప్పి చూపించారు అనిల్ రావిపూడి. మాస్టర్ కొట్టాక.. నొప్పి తట్టుకుంటూ మాస్టార్ నే కొట్టాడనికని వెళ్లి తిరిగి వచ్చి నీ పని చెబుతా అన్నట్లుగా వార్నింగ్ ఇస్తారని చేసి చూపించారు డైరెక్టర్. ఈ యాక్టింగ్ కమెడియన్స్ లేచి మరి చప్పట్లు కొట్టారు. ఇలా తన స్కిట్ తో అందరిని నవ్వించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనంతరం పీటీ సార్ అబ్బాయిలను ఒకలా, అమ్మాయిలను మరొలా ట్రీట్ చేస్తారని సద్దాం చేసి చూపించింది బాగా ఆకట్టుకుంది.

    English summary
    Aha Comedy Stock Exchange With Anil Ravipudi As Chairman And Sudigali Sudheer Deepika Pilli As Anchors. Anil Ravipudi Comedy Skit In Released Promo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X