Sudigali Sudheer: 'పాన్ ఇండియా' చిత్రంలో సుడిగాలి సుధీర్.. టైటిల్ మార్చాలంటూ డైరెక్టర్ సలహా!

మ్యాజిక్ షోలు చేసుకుంటూ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యాడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సుడిగాలి సుధీర్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. బుల్లితెర మీద విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అతికొద్దిమందిలో సుధీర్ ఒకరు. యాంకర్ గా, కమెడియన్ గా రాణిస్తూనే హీరోగా తానేంటో నిరూపించుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడ్, గాలోడు సినిమాలతో వెండితెరపై కనిపించిన సుడిగాలి సుధీర్ తాజాగా ఓ పాన్ ఇండియా చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఈ సినిమా టైటిల్ లో మార్పు చేయాలని డైరెక్టర్ సలహా కూడా ఇచ్చారు. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది.. ఏంటీ ఆ పాన్ ఇండియా సినిమా అనే విషయంలోకి వెళితే..

 బుల్లితెర కమెడియన్లతో..

బుల్లితెర కమెడియన్లతో..

ఇప్పటికీ బుల్లితెరపై అనేక కామేడీ షోలు తెగ సందడి చేశాయి. అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో తెలుగు ఓటీటీ వేదికగా ప్రేక్షకులు మన్ననలు పొందుతోంది ఆహా. సరికొత్త కాన్సెప్ట్స్ తో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే కామెడీ షోను స్టార్ట్ చేసింది. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ పేరుతో బుల్లితెరపై కమెడియన్లతో నవ్వులు పంచనుంది.

యాంకర్స్ గా దీపిక, సుధీర్..

యాంకర్స్ గా దీపిక, సుధీర్..

ఆహా వేదిక ప్రారంభమైన కామెడీ స్టాక్ ఎక్స్చేంజీ షోకి ఛైర్మన్ గా అంటే న్యాయ నిర్ణేతగా సరిలేరు నీకెవ్వరు, F2, F3 చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి యాంకర్స్ గా సందడి చేస్తున్నారు. ఇక సెలబ్రిటీ కమెడియన్స్ అయిన వేణు, అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్, యాదమ్మ రాజు స్టాక్స్ గా ఉండనున్నారు.

10 ఎపిసోడ్స్ గా కామెడీ షో..

10 ఎపిసోడ్స్ గా కామెడీ షో..

ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోలో కమెడియన్స్ స్టాక్స్ గా ఉండగా.. ఇన్వెస్టర్లుగా ఆడియెన్స్ ఉంటారు. అంటే స్టాక్స్ కు ఆడియెన్స్ ఓట్లు వేస్తారు. అక్కడ ఎక్కువ ఓట్లు గెలుచుకున్న వారు ఛైర్మన్ మనసు గెలుచుకుని టాప్ స్టాక్ గా పేరు తెచ్చుకుంటారు. సరికొత్త కామెడీ ఎంటర్టైన్ మెంట్ షో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ 10 ఎపిసోడ్స్ గా సాగనుంది. ఆహాలో డిసెంబర్ 2 నుంచి ఈ నవ్వుల షో ప్రారంభమైంది.

అది గుండెనా గుడారమా..

అది గుండెనా గుడారమా..

ఇప్పటికే 6 ఎపిసోడ్స్ ప్రసారం కాగా తాజాగా ఏడో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో కమెడియన్స్ వివిధ గెటప్పుల్లో వచ్చిన నవ్వించారు. అలాగే దీపికా పిల్లి, సుడిగాలి సుధీర్ స్టైలిష్ దుస్తుల్లో వచ్చి అదిరిపోయే డ్యాన్స్ చేశారు. స్కిట్స్ లో భాగంగా సుడిగాలి సుధీర్ ఎలాంటోడో చెబుతానంటూ ఎక్స్ ప్రెస్ హరి కామెడీ చేశాడు. అమ్మాయిలందరి దగ్గరికి వెళ్లి గుండెల్లో పెట్టుకుంటానంటాడు. అది గుండెనా గుడారమా.. ఎంతమందిని పెట్టుకుంటావని పంచ్ వేశాడు హరి.

తెలుగులోనే రిలీజ్ అవుద్ది..

తెలుగులోనే రిలీజ్ అవుద్ది..

ప్రోమో ప్రారంభంలో సుధీర్ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు సర్ అని డైరెక్టర్ అనిల్ రావిపూడికి దీపిక పిల్లి చెబుతుంది. దీంతో సుధీర్ సిగ్గుపడిపోతాడు. అప్పుడు అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందా అని అనిల్ రావిపూడి అడిగారు. లేదు సార్.. తెలుగులోనే రిలీజ్ అవుతుంది అని అమాయకంగా సుధీర్ చెప్పాడు. మరి తెలుగులో విడుదల అయితే పాన్ ఇండియా ఎలా అవుద్దిరా అని అడిగారు దర్శకుడు అనిల్ రావిపూడి.

బ్యాన్ సుధీర్..

అనిల్ రావిపూడి అడిగిన ప్రశ్నకు సినిమా పేరు పాన్ ఇండియా. యూట్యూబ్ లో విడుదల చేస్తారు. అది షార్ట్ ఫిల్మ్ అని సుడిగాలి సుధీర్ చెబుతాడు. దీంతో అందరూ నవ్వేస్తారు. అప్పుడు వీలైతే టైటిల్ మార్చవచ్చా అని అనిల్ రావిపూడి అడిగారు. ఏం మార్చొచ్చు సార్ అని సుధీర్ అంటే.. పాన్ ప్లేస్ లో బ్యాన్ పెట్టు అంటే బాగుందని అంటాడు సుధీర్. తర్వాత మరి ఇండియా ప్లేస్ లో అని అడిగితే.. నీ పేరు పెట్టు అని వెళ్లిపోతాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. దీంతో ఆ పాన్ ఇండియా అనే సినిమా పేరు కాస్తా బ్యాన్ సుధీర్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X