OTT డంకీ, సలార్‌ను తొక్కేసిన యానిమల్.. ఓటీటీలో కూడా సందీప్ రెడ్డి వంగా ప్రభంజనం!
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ 2023 సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులు తిరగరాసింది. అయితే ఈ సినిమా కేవలం థియేట్రికల్‌గానే కాకుండా ఓటీటీలో కూడా భారీ వ్యూస్‌ను రాబట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సినిమా షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమా కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించినట్టు సమాచారం. ఈ వివరాల్లోకి వెళితే..
డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ చిత్రం తొలి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్లింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఈ చిత్రం భారీగా కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం 900 కోట్లకుపైగా వసూళ్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

ఇక యానిమల్ సినిమా సక్సెస్‌పుల్‌గా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఓటీటీలో కూడా భారీగానే వ్యూస్ సాధించింది. ఈ చిత్రం ఓటీటీలో ఇప్పటికీ 13.6 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇటీవల కాలంలో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇక షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం భారీ అంచనాలతో డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా అంచనాలను తలకిందులు చేసింది. అయితే మిక్స్‌డ్ టాక్ రావడంతో ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో 480 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం పఠాన్, జవాన్ సినిమా స్థాయిలో రాణించలేకపోయింది.

ఇదిలా ఉండగా, డంకీ చిత్రం వాలైంటెన్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం ఓటీటీలో భారీగానే వ్యూస్ సాధించింది. ఈ సినిమాకు 10.8 మిలియన్ వ్యూస్‌ను ఓటీటీలో సాధించింది.
ఇక నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఇతర సినిమాల విషయానికి వస్తే.. భక్షక్ 10 మిలియన్ల వ్యూస్, గుంటూరు కారం 5 మిలియన్ల వ్యూస్, హయ్ నాన్న 4.2 మిలియన్ల వ్యూస్, సలార్ 3.5 మిలియన్ల వ్యూస్, అన్నపూర్ణి 3.1 మిలియన్ల వ్యూస్, కర్రీ అండ్ సైనెడ్ 2.1 మిలియన్ల వ్యూస్ సాధించాయి.


Click it and Unblock the Notifications











