Animal OTT: యానిమల్ ఓటీటీపై క్రేజీ లీక్.. మసాలా దట్టించి ఆరోజు నుంచే రచ్చ
యానిమల్.. యానిమల్.. యానిమల్.. దాదాపు రెండు మూడు నెలలుగా ఇండియా వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో ఇది ఒకటి. అంతలా ఈ చిత్రం టాలీవుడ్, బాలీవుడ్ బాక్సాఫీస్‌లపై ప్రభావాన్ని చూపించి సత్తాను చాటుకుంది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఎన్నో రికార్డులను సైతం క్రియేట్ చేసింది. దీంతో ఈ యాక్షన్ సినిమా సెన్సేషన్ అయిపోయింది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ - టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందిన సినిమానే 'యానిమల్'. యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుక తగ్గట్లుగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అనుకున్నట్లుగానే ఈ మూవీకి మంచి టాక్ రావడంతో రెస్పాన్ కూడా లభించింది.

క్రేజీ కాన్సెప్టుతో తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి ఇండియాలో మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం భారీగానే రాణించింది. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 900 కోట్లుకు పైగా గ్రాస్‌ను, రూ. 550 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి సత్తా చాటుకుంది. తద్వారా ఈ సినిమా ఎన్నో రికార్డులను సైతం నమోదు చేసుకుంది.
హై రేంజ్ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను తీసుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని కూడా చెల్లించినట్లు తెలిసింది. అలాగే, దీన్ని జనవరి 26వ తేదీన స్ట్రీమింగ్ చేస్తారని ముందే ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ముందు నుంచీ ప్రచారం అవుతున్నట్లుగానే 'యానిమల్' మూవీని జనవరి 26వ తేదీ నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలిసింది. అంతేకాదు, థియేటర్ వెర్షన్ కాకుండా కొత్త కంటెంట్‌ను యాడ్ చేసి దీన్ని తీసుకు రాబోతున్నారట. తాజా సమాచారం ప్రకారం.. 3 గంటల 29 నిమిషాల 34 సెకెన్ల నిడివితో ఓటీటీ వెర్షన్ రాబోతుందని తాజాగా తెలిసింది.
ఇదిలా ఉండగా.. 'యానిమల్' మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











