వేశ్య పాత్రలో అంజలి... ఏ ఓటిటిలో చూడొచ్చు? ఎప్పుడు రిలీజ్ అంటే?

By Lekhaka

తెలుగమ్మాయి అంజలి మరోసారి వేశ్య పాత్రలో పేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతోంది. రేసుగుర్రం సినిమాలో చిలకలూరి చింతామణి అంటూ స్పెషల్ సాంగ్ లో ఉర్రూతలూగించిన అంజలి రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా ఇలాంటి పాత్రలోనే నటించి మెప్పించింది. తాజాగా మరోసారి అదే పాత్రతో తెరపైకి రాబోతోంది. మరి ఆ సినిమా ఏంటి? ఏ ఓటీటీలో చూడవచ్చు అనే విషయంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం పదండి.

పుష్ప అనే ఓ వేశ్య జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి సిద్దమవుతున్నారు డైరెక్టర్ ముఖేష్ ప్రజాపతి. బహిష్కరణ అనే టైటిల్ తో రూపొందిన ఈ ఒరిజినల్ తెలుగు సిరీస్ లో అంజలి ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఈ సిరీస్‌లో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, శ్రీతేజ్, షణ్ముఖ్, మహబూబ్ బాషా, చైతన్య సాగిరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పిక్సెల్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రశాంతి మలిశెట్టి నిర్మించిన ఈ సిరీస్ Zee 5లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Anjali s Bahishkarana locks its OTT plotform and release date

తాజాగా మేకర్స్ ఈ సిరీస్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయడంతో పాటు రిలీజ్ డేట్, ఓటీటీ ప్లాట్ ఫామ్ వంటి డీటైల్స్ ను కూడా వెల్లడించారు. ఇందులో అంజలి పుష్ప పాత్రలో కనిపించనుంది. బహిష్కరణ అనే ఈ సిరీస్ నిజమైన ఆనందాన్ని కనుగొనడానికి వేశ్య చేసే లోతైన ప్రయాణాన్ని, అందులో ఆమెకు ఎదురైన సవాళ్లను చూపించబోతున్నారు. ఈ కథ 1990ల నాటి గుంటూరు గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇక ఇందులో అంజలి పాత్ర ఎమోషనల్ గా ఉంటుందని ఫస్ట్ లుక్ ను చూస్తేనే అర్థం అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే.. 1990వ దశకంలో పెద్దపల్లి స్థానిక వ్యక్తి అయిన దర్శి పనికి వెళ్ళి ఇంటికి తిరిగి రానప్పుడు కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. ఈ సంఘటన ఒక రహస్యమైన గతంతో వేశ్య పుష్ప, దర్శి, ఆయన భార్య లక్ష్మికి సంబంధించిన సంబంధాలను ఆవిష్కరిస్తుంది. కథలో నెమ్మదిగా రహస్యాల పొరలు తొలగిపోతున్నప్పుడు ప్రేమ, ద్రోహం, విధి వంటి దిగ్భ్రాంతికరమైన ట్విస్ట్ లు ఒక్కొక్కటిగా రివీల్ అవుతాయి.

Anjali s Bahishkarana locks its OTT plotform and release date Anjali s Bahishkarana locks its OTT plotform and release date

గ్రామ సర్పంచ్ శివయ్య ఈ క్లిష్టమైన డ్రామాలో కీలక పాత్ర పోషిస్తాడు. మరి ఈ క్రమంలో సామాజిక రూల్స్ ను అతిక్రమించిన హీరోయిన్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది బహిష్కరణను చూసి తెలుసుకోండి. బహిష్కరణలో ప్రధాన పాత్రను పోషిస్తున్న అంజలి తన పాత్ర గురించి మాట్లాడుతూ బహిష్కరణలో పుష్ప పాత్ర పోషించడం నాకు చాలా సంతృప్తికరంగా అన్పించిందని పేర్కొన్నారు.

ఒక అమాయక వేశ్య నుండి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా బలం, ధైర్యాన్ని కూడగట్టుకునే స్త్రీ వరకు నా పాత్ర ప్రయాణం సవాలుగా ఉండడమే కాదు స్ఫూర్తినిస్తుంది అని అన్నారు అంజలి. అంతేకాకుండా పుష్ప అనే అమ్మాయి రహస్య కథ, ఆమె తప్పును సరిదిద్దడానికి తీసుకునే నిర్ణయం కఠినమైన పరిస్థితుల్లో మహిళల దృఢత్వం, ధైర్యానికి నిదర్శనం. నాకు నచ్చినట్టుగానే ZEE5 ప్రేక్షకులను కూడా ఈ కథ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. మరి ఈ రివేంజ్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X