ఓటీటీలోకి తెలుగు హీరోయిన్ల బోల్డ్ సిరీస్.. ఎప్పుడు ఎక్కడ వస్తుందంటే!
ఒకప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్‌కు సినిమాలు మాత్రమే ఆప్షన్‌గా ఉండేవి. కానీ, ఇప్పుడు ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వెబ్ సిరీస్‌లు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో రకాల సిరీస్‌లు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా తెలుగులో కూడా ఈ మధ్య కాలంలో చాలా జోనర్లలో సిరీస్‌లు వచ్చాయి. వాటికి అదిరిపోయే స్పందన వస్తోంది.
తెలుగులో వెబ్ సిరీస్‌ల ట్రెండ్ కనిపిస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు మరొకటి రూపుదిద్దుకుంటోంది. అదే 'బహిష్కరణ' (Bahishkarana). టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ను ముఖేష్ ప్రజాపతి తెరకెక్కించాడు. 1990 నాటి కథతో గుంటూరు రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో ఇది రూపొందింది. దీంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది.

అంజలి వేశ్య పాత్రలో నటించిన 'బహిష్కరణ' వెబ్ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని క్రమంగా జరుపుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం పూర్తి చేసుకున్నారు. ఇలా ఈ సినిమాపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. కానీ, దీనిపై ఎలాంటి సమాచారం రావట్లేదు.
తెలుగు హీరోయిన్లు అంజలి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన 'బహిష్కరణ' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌పై ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో అసలు క్లారిటీ కోసం అంతా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వెబ్ సిరీస్‌ను జూలై 19 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు జీ5 (ZEE5) సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం వదిలింది.

ఇక, డిఫరెంట్ స్టోరీతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న 'బహిష్కరణ' వెబ్ సిరీస్‌ను గ్రామీణ వాతావరణంలో కనిపించే కొన్ని కట్టుబాట్లను బేస్ చేసుకుని తెరకెక్కించారు. ఇందులో అంజలి ఓ వేశ్య పాత్రను పోషించింది. ఆమెతో పాటు ఎంతో మంది నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఫలితంగా ఈ వెబ్ సిరీస్‌పై అంచనాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి.
ఇదిలా ఉండగా.. 'బహిష్కరణ' వెబ్ సిరీస్‌ను విక్సెల్ పిక్చర్ ఇండియా పతాకంపై ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు. ఇందులో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, శ్రీతేజ్, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మమ్మద్ బాషా కీలక పాత్రలు నటించారు. ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











