మూడు పూటలా స్వర్గం చూపిస్తా.. చీరను పైకి లేపుతూ రెచ్చిపోయిన అంజలి
ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్లు, రియలిస్టిక్ స్టోరీలకు ప్రేక్షకులు భారీ స్పందనను అందిస్తున్నారు. దీంతో ఇదే తరహాలో ఓటీటీ సంస్థలు వెబ్ సిరీస్‌లను సైతం రూపొందిస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో వచ్చి ఆడియెన్స్‌ను అలరించాయి. ఇప్పుడలా రాబోతున్న కొత్త సిరీసే 'బహిష్కరణ' (Bahishkarana).
స్టార్‌గా సత్తా చాటుతోన్న అచ్చ తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసే 'బహిష్కరణ'. ముఖేష్ ప్రజాపతి తెరకెక్కించిన ఇది 1990 నాటి కథతో గుంటూరు రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో ఇది రూపొందింది. దీంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సిరీస్‌ను రియలిస్టిక్ సీన్స్‌తో తీశారు.

అంజలి లీడ్ రోల్‌లో నటించిన 'బహిష్కరణ' వెబ్ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని క్రమంగా జరుపుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం పూర్తి చేసుకున్నారు. ఇలా ఈ సిరీస్‌పై అంచనాలు క్రమంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే దీనిపై ప్రకటన వచ్చింది.
తెలుగు హీరోయిన్ అంజలి నటించిన 'బహిష్కరణ' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌పై ఎన్నో రకాల ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో అసలు క్లారిటీ కోసం అంతా వేచి చూశారు. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్‌ను జూలై 19 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు జీ5 (ZEE5) సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే ఓ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది.
'బహిష్కరణ' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు సమయం దగ్గర పడడంతో తాజాగా దీని నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో అంజలి పాత్రను ఎంతో వైలెంట్‌గా చూపించారు. ముఖ్యంగా ఆమె వేశ్యగా 'ఆకు వక్క అందిస్తా.. మూడు పూటలా స్వర్గం చూపిస్తా' అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక, ఈ టీజర్ బోల్డుగా, వైలెంట్‌గా ఉంది. దీంతో దీనికి భారీ రెస్పాన్స్ లభిస్తోంది.
ఇదిలా ఉండగా.. అంజలి వేశ్య పాత్రలో నటించిన 'బహిష్కరణ' వెబ్ సిరీస్‌ను విక్సెల్ పిక్చర్ ఇండియా పతాకంపై ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు. ఇందులో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, శ్రీతేజ్, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మమ్మద్ బాషా కీలక పాత్రలు నటించారు. ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు సిద్ధార్థ్ సదాశివుని మ్యూజిక్ కంపోజ్ చేశారు.


Click it and Unblock the Notifications











