ఓటీటీలోకి తెలుగు దెయ్యం సినిమా.. నవ్విస్తూనే భయపెట్టే ఈ మూవీని ఎక్కడ చూడాలంటే!
ఇండియాలోని మిగిలిన ఇండస్ట్రీల మాదిరిగానే తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఈ మధ్య కాలంలో హర్రర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలా వచ్చిన వాటికి ప్రేక్షకులు జై కొడుతుండడంతో.. ఆ తరహాలోనే మరిన్ని చిత్రాలు తెరకెక్కుతోన్నాయి. అలా కొద్ది రోజుల క్రితమే తెలుగు ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు వచ్చిన చిత్రమే 'గీతాంజలి మళ్లీ వచ్చింది'.
తెలుగు నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన హర్రర్ కామెడీ మూవీనే 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. శివ తుర్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రం గతంలో వచ్చి సక్సెస్ సాధించిన 'గీతాంజలి'కి సీక్వెల్‌గా రూపొందింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

అంజలి - శివ తుర్లపాటి కాంబినేషన్‌లో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ మూవీ ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కూడా కలెక్షన్లను పెద్దగా వసూలు చేయలేదు. తద్వారా ఈ సినిమా నష్టాలతో దాదాపుగా రన్‌ను ముగించింది. అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఎన్నో ప్రచారాలు మొదలయ్యాయి.
నవ్విస్తూనే భయపెట్టే స్టోరీతో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ మంచి మొత్తాన్నే ముట్టజెప్పినట్లు సమాచారం. ఇక, ఈ చిత్రం హిట్ కాకపోవడంతో నెల రోజుల కంటే ముందుగానే స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

అందరూ అనుకున్నట్లుగానే 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా తాజాగా ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలిసింది. ఫిలిం నగర్ ఏరియా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని మే 10వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు రాబోతున్నారట. ఈ విషయాన్ని సదరు సంస్థ ఈ రెండు మూడు రోజుల్లోనే అధికారికంగా ప్రకటించబోతుందని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రాన్ని కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య, అలీ, రవిశంకర్, శైలజా ప్రియ తదితరులు నటించారు. ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











