మీ ఇంటికి వచ్చేసిన దెయ్యం సినిమా.. బెదురు పుట్టించే ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే!
మిగిలిన జోనర్లతో పోలిస్తే హర్రర్ సినిమాలు ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించి ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అందుకే ఇలా చిత్రాలకు మంచి స్పందన కూడా లభిస్తుంటుంది. ఈ కారణంగానే ఈ మధ్య కాలంలో హర్రర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. తెలుగులో కూడా వీటి సంఖ్య పెరిగింది. ఇలా ఈ మధ్య వచ్చిన క్రేజీ సినిమానే 'గీతాంజలి మళ్లీ వచ్చింది'.
అంజలి లీడ్ రోల్‌లో నటించిన హర్రర్ అండ్ కామెడీ సినిమానే 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. శివ తుర్లపాటి తెరకెక్కించిన ఈ మూవీ.. గతంలో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన 'గీతాంజలి'కి సీక్వెల్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసుకున్నారు.

తెలుగు నటి అంజలి 50వ చిత్రంగా వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ మూవీ ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కూడా కలెక్షన్లను పెద్దగా వసూలు కాలేదు. తద్వారా ఈ సినిమా నష్టాలతోనే రన్‌ను ముగించింది. అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఫిలిం నగర్ ఏరియాలో ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి.
ఫన్ అండ్ హర్రర్ స్టోరీతో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ మంచి మొత్తాన్నే ముట్టజెప్పింది. ఇక, ఈ చిత్రాన్ని మే 8వ తేదీ నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. కానీ, ఈ చిత్రం బుధవారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రాలేదు.

అనుకున్న సమయానికి (మే 8) స్ట్రీమింగ్ కాకపోవడంతో 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా ఓటీటీ వాయిదా పడిందని అంతా అనుకున్నారు. కానీ, అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ బుధవారం సాయంత్రానికి ఆహాలో ఈ మూవీ దర్శనమిచ్చింది. ఇందులో ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన లభిస్తోందని తెలిసింది. మరి ఇది ఆహాలో ఏమైనా రికార్డులు కొడుతుందేమో చూడాలి.
ఇదిలా ఉండగా.. హర్రర్ కాన్సెప్టుతో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రాన్ని కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య, అలీ, రవిశంకర్, శైలజా ప్రియ తదితరులు నటించారు. ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ కంపోజ్ చేశారు.


Click it and Unblock the Notifications











