Prince Movie OTT: అనుదీప్ ప్రిన్స్ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

జాతి రత్నాలు సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విధంగా భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును అందుకున్నాడు. అతను సుమా క్యాష్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మంచి క్రేజ్ అందుకుంటూ వచ్చాడు. ఇక అతను ఇంటర్వ్యూలకు కూడా యూట్యూబ్ లలో మంచి రెస్పాన్స్ వస్తూ ఉండడంతో అతను కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే అనుదీప్ నుంచి వచ్చిన రెండో సినిమా ప్రిన్స్ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

తెలుగు తమిళంలో ఒకేసారి విడుదలైన ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటించాడు. అయితే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటుంది అనుకున్న ఈ సినిమా కొన్ని ఏరియాలలో అయితే చాలా దారుణంగా నష్టాలను కలుగజేసింది. చివరికి అనుదీప్ కూడా ఈ సినిమా రిజల్ట్ పై కొన్ని తప్పులు జరిగాయని ఒప్పుకోక తప్పలేదు.

Anudeep kv prince movie ott release update details

ఇక ఓటీటీలో ప్రిన్స్ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను హాట్ స్టార్ డిస్నీ ప్లస్ సొంతం చేసుకుంది. ఇక నవంబర్ 25వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల కాబోతోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఒకేసారి ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఒక విధంగా శివకార్తికేయన్ గత కొంతకాలంగా తన సినిమాలతో తెలుగులో కూడా మార్కెట్ పెంచుకోవాలని అనుకున్నాడు. డాక్టర్, డాన్ సినిమాలకు తెలుగులో కూడా మంచి గుర్తింపు లభించింది. అయితే డైరెక్ట్ గా తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవాలని అనుదీప్ తో చేసిన ప్రిన్స్ సినిమా మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. ఇక అతను మరొక సినిమాను తెలుగులో భారీగా విడుదల చేయాలని ఆలోచిస్తున్నాట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X