JSK on OTT: ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ కాంట్రవర్సీ మూవీ.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
మలయాళం సూపర్ స్టార్, కేంద్ర మంత్రి సురేష్ గోపి, స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ జాహ్నవి V/s స్టేట్ ఆఫ్ కేరళ (JSK). లైంగిక దాడి, వేధింపుల ఆధారంగా కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫణీంద్ర కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో గిరీష్ నారాయణన్ స్వరపరిచిన పాటలు, గిబ్రాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ఈ చిత్రానికి రెనదివే సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగింపుకొచి ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వివరాల్లోకి వెళితే..
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా రిలీజ్‌కు ముందు వివాదంలో చిక్కుకొన్నది. ఈ సినిమా టైటిల్‌లో శ్రీరామ చంద్రుడి భార్య జానకి పేరును లైంగిక దాడి బాధితురాలిగా పెట్టడంపై కేరళ హైకోర్టు, సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. దాంతో ఈ సినిమాను ముందుగా నిర్ణయించుకొన్న తేదీని వాయిదా వేసి.. కోర్టు, సెన్సార్ బోర్డు క్లియరెన్స్ తర్వాత జాహ్నవి Vs స్టేట్ ఆఫ్ కేరళ (JSK) టైటిల్‌తో రిలీజైంది.

ప్రఖ్యాత న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? అసలు జానకి జీవితంలో ఏం జరిగింది? న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
మలయాళ సినిమా పరిశ్రమలో అడుగపెట్టి.. దక్షిణాదిలో పలు చిత్రాల్లో, అగ్ర హీరోలతో నటించిన అనుపమ పరమేశ్వరన్ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మలయాళ చిత్రంలో నటించింది. అప్పట్లో నాకు నటించడం రాదని చాలా మంది ట్రోల్ చేశారు. కానీ నాకు ఇండస్ట్రీలో ప్రేక్షకులు సముచితమైన స్థానాన్ని ఇచ్చారు. కావాలని మాలీవుడ్‌కు దూరం కాలేదు అని ఇటీవల ఆమె వివరణ ఇచ్చారు.
ఈ సినిమాకు, ఈ చిత్రంలో నటించిన యాక్టర్లకు క్రిటిక్స్ నుంచి భారీ ప్రశంసలు లభించాయి. అయితే ఈ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయింది. థియేట్రికల్ రన్‌లో 5.5 కోట్ల రూపాయల నికర కలెక్షన్లు 11 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను మలయాళ బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. ఇటీవలే థ్రియేట్రికల్ రన్‌ను ముగించుకొని దేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫామ్ ZEE5 స్ట్రీమింగ్ కానున్నది.
2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సంక్రాంతికి వస్తున్నం, రాబిన్‌హుడ్, భైరవం వంటి వరుస తెలుగు సూపర్‌హిట్‌లను అందించిన తర్వాత ZEE5 తెలుగు ఇప్పుడు మరో అద్భుతమైన సినిమాను అందించనున్నది. విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ డ్రామా JSK - జాహ్నవి V v/s స్టేట్ ఆఫ్ కేరళ' తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది.


Click it and Unblock the Notifications











