OTT: నేరుగా ఓటీటీలోకి రానున్న అనుపమ పరమేశ్వరన్ చిత్రం.. 6 రోజుల గ్యాప్ తో డబుల్ ట్రీట్!
అందం, అభినయంతో ఆకట్టుకునే బ్యూటిఫుల్ హీరోయిన్స్ లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. కేరళకు చెందిన ఈ బ్యూటి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఉత్తమ నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతోంది ఈ భామ. ఇటీవల కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. మరోసారి నిఖిల్ తో 18 పేజీస్ సినిమాతో జత కట్టింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అలాగే 18 పేజీస్ చిత్రమే కాకుండా మరో సినిమాతో ఇదే నెలలో అలరించడానికి సిద్ధమైంది క్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఆ వివరాళ్లోకి వెళితే..

శతమానం భవతి సినిమాతో..
అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులోని మేరీ జార్జ్ పాత్రతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత మలయాళంలో మరో చిత్రంలోనూ అలరించిన ఈ ముద్దుగుమ్మ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
అనంతరం అక్కినేని నాగ చైతన్య నటించిన తెలుగు 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి పలు చిత్రాల్లో నటించింది. అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన శతమానం భవతి సినిమాతో మంచి విజయం సాధించింది.

జోరుగా సాగుతున్న ప్రమోషన్స్..
శతమానం భవతి సినిమాతో హిట్టు కొట్టిన బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ యూత్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవల విడుదలైన కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇప్పుడు మరోసారి నిఖిల్ తో 18 పేజీస్ సినిమాలో నటించింది.
ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ తన ఫ్యాన్స్ కు ఈ నెల డబుల్ ట్రీట్ ఇవ్వనుంది. అంటే ఇదే నెల మరో సినిమాతో సందడి చేయనుంది. అంటే బటర్ ఫ్లై అనే మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ కేరళ కుట్టి.
6 రోజుల గ్యాప్ తో..
సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్ర పోషించిన బటర్ ఫ్లై సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను గంటా సతీష్ బాబు నిర్వహించారు. జెన్ నెక్ట్స్ సినిమా బ్యానర్ పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. అర్వీజ్, గిడియోన్ కట్టా సంగీతం అందించిన బటర్ ఫ్లై సినిమా నేరుగా ఓటీటీలోకి రానుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా డిసెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంటే ఆరు రోజులు గ్యాప్ తో రెండు సినిమాల ద్వారా అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఒకటి థియేటర్ లో సందడి చేయనుండగా.. మరొకటి ఓటీటీలో అలరించనుందన్నమాట.


Click it and Unblock the Notifications











