OTTలోకి మరో రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి మరో లేటెస్ట్ థ్రిల్లర్ రాబోతుంది. అది కూడా మహానటి కీర్తి సురేష్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించి చిత్రం సైరన్. ఈ సినిమా తమిళంలో రిలీజ్ అయి సూపర్ హిట్టుగా నిలిచింది. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో తెలుగులో కూడా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సిినిమా ఎప్పుడు, ఎక్కడ ఏ ఓటీటీలో సందడి చేస్తుందో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
ఇద్దరు టాలీవుడ్ పాపులర్ హీరోయిన్స్ కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన చిత్రం సైరెన్. ఇక ఈ మూవీలో తమిళ హీరో జయం రవి హీరోగా నటించారు. ఈ సినిమా తమిళంలో రిలీజ్ అయి సూపర్ హిట్టుగా నిలిచింది. రివేంజ్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన సైరన్ మూవీకి ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించగా.. ఆయనే కథను సైతం అందించారు. ఈ సినిమాకు సూజాత విజయ్ కుమార్, అనూష విజయ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు.

2023లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ కోలీవుడ్ మూవీ.. ఇటీవల తమిళంలో ఫిబ్రవరి 16న విడుదలైంది. రిలీజ్ అయి రెండు రోజులు కావొస్తుండగా.. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. సైరన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. కమెడియన్ యోగిబాబు, నటుడు సముద్రఖని, కౌశిక్ మెహతా, తులసి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఇందులో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో జయం రవి నటించాడు.
మొదట ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ చివరిగా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా ఇదే టైటిల్ తో విడుదల చేయనున్నారు మేకర్స్. 'గంగ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి ఫిబ్రవరి 23న సైరన్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు. కొన్ని రోజుల గ్యాపుతో కీర్తి సురేష్, జయం రవి నటించిన సైరన్ మూవీ థియేటర్లలోకి రానుంది.

అనుపమ, కీర్తి, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన సైరన్ ఓటీటీ డీల్ ఫిక్స్ అయిందని సమాచారం. ఈ మూవీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మంచి ధరకు కొనుగోలు చేసింది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత నెల లేదా 45 రోజుల తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సైరన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
ఇక తెలుగులో కూడా అప్పుడే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇదే కాకుండ సైరన్ శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా ఛానెల్ భారీ మొత్తానికి దక్కించుకుందని తెలుస్తోంది. ఇలా తెలుగులో విడుదల కాకముందే తమిళంలో దూసుకుపోతున్న సినిమా.. త్వరలో ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఇక ఈ సైరన్ సినిమా ఒక రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కగా.. ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.


Click it and Unblock the Notifications











