Miss Shetty Mr Polishetty OTT: ఆ సంస్థకు అనుష్క మూవీ ఓటీటీ, శాటిలైట్ రైట్స్.. గత చిత్రాల్లాగే!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎవరు దక్కించుకోలేని పాపులారిటీ సంపాదించుకుంది బ్యూటిఫుల్ అనుష్క శెట్టి. హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రాలను మళ్లీ నిర్మించి హిట్టు కొట్టవచ్చని నిరూపించింది ఈ ముద్దుగుమ్మ. అరుంధతి తర్వాత పంచాక్షరి, భాగమతి, నిశబ్దం, జీరో సైజ్ వంటి మహిళా ప్రాధాన్యత చిత్రాలు చేసి అలరించింది. ఇక బాహుబలి సినిమా తర్వాత సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటి ఇప్పుడు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనే కొత్త సినిమాతో రానుంది. అయితే ఈ మూవీ ఓటీటీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్ గా మారింది.

చాలా గ్యాప్ తర్వాత..

చాలా గ్యాప్ తర్వాత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమైంది. ఆమె చివరిగా లీడ్ పాత్రలో నటించిన భాగమతి థియేటర్లలో విడుదల అయింది. ఇక తర్వాత మళ్లీ నిశ్శబ్దం సినిమా చేసినప్పటికీ అది ఓటీటీ లో నేరుగా విడుదలైంది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది ఈ బ్యూటి. ఇక ఇన్నాళ్లకు ఆమె మళ్లీ వెండితెరపై కనువిందు చేయనుంది.

 అలాంటి సినిమాలతో..

అలాంటి సినిమాలతో..

అనుష్క బాహుబలి 2 ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు అందుకుంటే.. జాతి రత్నాలు సినిమాతో మంచి క్రేజ్ అందుకున్నాడు యువ హీరో నవీన్ పోలిశెట్టి. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి నటించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. టాలీవుడ్ లో అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆమెకు ఒక స్టార్ హీరోకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఏజెంట్ ఆత్రేయ సాయి శ్రీనివాస్, జాతి రత్నాలు సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి.

 ప్రముఖ నిర్మాణ సంస్థతో..

ప్రముఖ నిర్మాణ సంస్థతో..

జాతి రత్నాలు తర్వాత థియేటర్లలో విడుదల కాబోతున్న నవీన్ పోలిశెట్టి చిత్రమే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఇందులో అనుష్క అన్విత రవళి శెట్టి అనే ఫేమస్ చెఫ్ పాత్రలో నటిస్తుండగా.. నవీన్ సిద్దు పోలీశెట్టి అనే ఒక స్టాండప్ కమెడియన్ గా అలరించబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది.

క్రేజీ కాంబినేషన్.. ఆ గ్రూపుకు..

క్రేజీ కాంబినేషన్.. ఆ గ్రూపుకు..

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు రథన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే మంచి ధరకు శాటిలైట్స్, డిజిటల్ రైట్స్ అమ్ముడు పోవడం ఆసక్తి కలిగిస్తోంది. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి వంటి క్రేజీ కాంబినేషన్ తో వస్తున్న ఈ సినిమాను జీ గ్రూప్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

 మిగతా చిత్రాల్లాగే.. ఆ ఓటీటీలో..

మిగతా చిత్రాల్లాగే.. ఆ ఓటీటీలో..

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. థియేటర్లో విడుదలైన కొన్ని రోజులకు జీ5 ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు జీ గ్రూప్ ఛానెళ్లలో టెలీకాస్ట్ చేస్తారు. అయితే అనుష్క శెట్టి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన భాగమతీ హిందీ, తమిళ వెర్షన్స్ జీ5లోనే స్ట్రీమ్ అవుతున్నాయి. సైజ్ జీరో తెలుగు వెర్షన్ కూడా అందులోనే అందుబాటులో ఉంది. ఇలా మరికొన్ని అనుష్క చిత్రాల తరహాలోనే ఈ సినిమాను కూడా జీ గ్రూప్ కొనుగోలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X