OTTలోకి రాబోతున్న అనుష్క సేన్ క్రేజీ వెబ్ సిరీస్.. అనుక్షణం అలరించే దీన్ని ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అనేక అదిరిపోయే వెబ్ సిరీస్ లు, సినిమాలు విడుదల అవుతూ.. ఓటీటీ ప్రియులను తెగ అలరిస్తున్నాయి. ముఖ్యంగా సినీ ప్రియులను అలరించేందుకు అద్భుతమైన సినిమాలు తీసుకు వచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు దర్శక, నిర్మాతలు. ఇప్పటికే ఓటీటీల వేదికగా అకనే చిత్రాలు, వెబ్ సిరీస్ లు రాగా.. తాజాగా ఓ క్రేజీ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అనుష్క సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రేజీ వెబ్ సిరీస్ యే దిల్ దోస్తీ డైలమా. ఈ వెబ్ సిరీస్ లో అనుష్క సేన్ తో పాటు కుష్ జోత్వాని, తన్వీ అజ్మీ, శిశిర్ శర్మ, సుహాసిని ములే, ఎలిషా మేయర్, రేవతి పిళ్లై, విశాఖ పాండే, రితిక్ ఘన్సాని, అర్జున్ బెర్రీ, శృతి సేథ్, ఖలీద్ సిద్ధిఖీ, పరిణితా సేథ్, ప్రియాంషు ఛటర్జీ, డి. సువాల్కా, సుదీప్ మోదక్, ఎషికా డే, నిత్యా బెరియా, శ్రేయ శంకర్, అక్షిత్ సుఖిజా, సమృద్ధి దత్తా, సోనాల్ ఝా, కెన్నీ పంచల్, అమిత్ సింగ్ ఠాకూర్, సువంశ్ ధర్, రిక్ రాయ్ వంటి వాళ్లు నటించారు.

Anuskha Sen Dil Dosthi Dilemma Web Series OTT Streaming Details here

వీళ్లు మాత్రమే కాకుండా మరికొంత మంది కూడా ఈ దిల్ దోస్తీ డైలమా వెబ్ సిరీస్ లో కనిపించబోతుండగా.. డెబ్బీ రావు దర్శకత్వం వహించారు. అలాగే సీమా మోహపాత్ర, జహనారా భార్గవలు ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. అనురాధ తివారీ, బగ్స్ భార్గవ కృష్ణ, మంజిరి విజయ్ పుపాల ఈ వెబ్ సిరీస్ ను కథను రాయగా.. దీని ఆధారంగానే ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీని కూడా ప్రకటించారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతున్నట్లు తాజాగా ఈ సంస్థ ఎక్స్ వేదికగా ప్రకటించింది. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుండగా... స్ట్రీమింగ్ డేట్ బయటకు రావడంతో మరింత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Anuskha Sen Dil Dosthi Dilemma Web Series OTT Streaming Details here

ముఖ్యంగా కెనడా వెళ్లాలనుకున్న ఓ అమ్మాయి ఓ పెద్ద తప్పు చేయడంతో.. తన నామ్మ వద్దకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడకు వెళ్లినా తాను మాత్రం కెనడానే వెళ్లానంటూ తన స్నేహితులతో చెప్పి కవర్ చేస్తుంటుంది. ఊరి పద్దతులు పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా మెదిలే ఈమె చివరకు కుటుంబ సభ్యులను అర్థం చేసుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం చివరి వరకూ చూడాల్సిందే. మరి ఈ క్రేజీ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఏప్రిల్ 25వ తేదీ నుంచి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X