Unstoppable with NBK 4: బావతోనే మొదలెడుతోన్న బాలయ్య..టాప్ లేపే ప్రశ్నలు సిద్ధం!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 3 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుని నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టింది. విజయదశమి పర్వదినం సందర్భంగా సీజన్ 4 ట్రైలర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. అంతా బాగానే ఉంది కానీ ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు గెస్ట్ ఎవరు? అనే దానిపై సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. దీనికి చెక్ పెడుతూ ఆహా టీమ్ గెస్ట్‌ని కన్ఫర్మ్ చేసింది . ఈ వివరాల్లోకి వెళితే:

ఆహాను రేసులో నిలబెట్టి.. ఇండియా వైడ్‌గా క్రేజ్ తీసుకొచ్చిన షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. ఈ ఒక్క కార్యక్రమంతో ఆహా సబ్‌స్క్రైబర్లు, వ్యూయర్‌షిప్ భారీగా పెరిగింది. నటసింహం నందమూరి బాలకృష్ణలోని మరో కోణాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది. అలాగే ఐఎండీబీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంలో, రీజినల్ లాంగ్వేజ్ కేటగిరీలో నెంబర్ వన్‌గా నిలిచింది అన్‌స్టాపబుల్. హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణను తీసుకురావాలన్న అల్లు అరవింద్ ప్లాన్ సూపర్‌ సక్సెస్ అయ్యింది.

ap cm Chandra babu naidu was the first guest for unstoppable with nbk season 4 in aha

బయట బాలయ్య గురించి జరిగే ప్రచారానికి , ఆయన ఒరిజినల్ క్యారెక్టర్‌కు ఏమాత్రం సంబంధం లేదని ప్రేక్షకులు కూడా తెలుసుకున్నారు. తన టైమింగ్, ఆట పాటలతో అన్‌స్టాపబుల్‌ను బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టారు బాలయ్య. ఇప్పటి వరకు మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు గాడ్ ఆఫ్ మాసెస్. ఈ షోకు పవన్ కళ్యాణ్ , మహేశ్ బాబు, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, నాని , శర్వానంద్, గోపీచంద్ సహా పలువురు హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు హాజరై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ సీజన్ 4 కోసం ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దసరా సందర్భంగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్‌ను గ్రాండ్ లాంచ్ చేసింది ఆహా టీమ్. ఇంత వరకు ఎప్పుడూ చూడని విధంగా బాలకృష్ణను సూపర్‌ హీరోగా ప్రజెంట్ చేశారు . అక్టోబర్ 24 నుంచి అన్‌స్టాపబుల్ సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతుందని ఆహా టీమ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఇంతకీ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్‌లో బాలయ్యతో వేదిక పంచుకునేది ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.

సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి , అల్లు అర్జున్, రామ్ చరణ్ హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ వీరెవరు కాదు బాలయ్య బావ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ఫస్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా వస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఫస్ట్ గెస్ట్ ఎవరో కన్ఫర్మ్ చేసేలా ఆహా టీమ్ సోషల్ మీడియాలో లీకులు ఇచ్చింది.

ముందు ప్రచారం జరిగినట్లుగా చంద్రబాబు, పవన్‌లలో.. ఏపీ సీఎం ఈ సీజన్ తొలి గెస్ట్‌గా రానున్నారట. రేపు జరిగే షూటింగ్‌లో చంద్రబాబు నాయుడు పాల్గొంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఆయనను ఏ ఇంటర్వ్యూలోనూ అడగని ప్రశ్నలను ఆహా టీమ్ సిద్ధం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి వీటికి చంద్రబాబు ఎలాంటి ఆన్సర్లు ఇచ్చారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X