Aparadhi : సీరియల్ కిల్లర్ ప్రేమికుడైతే.. నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి ఫహద్ ఫాజిల్ మూవీ

పుష్ప, పుష్ప 2 సినిమాలతో తెలుగువారికి బాగా దగ్గరయ్యారు మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్. ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఈ సినిమాలో ఆయన చూపిన క్రూరత్వాన్ని ప్రేక్షకులు మరిచిపోలేరు. పుష్ప సిరీస్ విజయవంతం కావడంలో ఫహద్ పాత్ర కూడా కీలకమే. పార్టీ లేదా పుష్పా అంటూ ఆయన చెప్పిన డైలాగ్, దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటూ పాట దేశాన్ని ఊపేసింది. కామెడీ, హార్రర్, సస్పెన్స్, యాక్షన్, లవ్, రొమాంటిక్ ఇలా ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా పరకాయ ప్రవేశం చేయగల అరుదైన నటుల్లో ఒకరిగా ఫహద్ ఫాజిల్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ఓ చిత్రం దాదాపు నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వస్తోంది. అది ఏ సినిమా? నాలుగేళ్లు ఓటీటీలోకి ఎందుకు రాలేదు? ఈ వివరాల్లోకి వెళితే..

Aparadhi OTT Release here is the Fahadh Faasil s Movie ott streaming details

గతంలో హిట్ కొట్టిన సినిమాలు ఓటీటీలోకి

క్రైమ్, సస్పెన్స్, హార్రర్ సినిమాలు తీయాలంటే ఇండియాలో మలయాళీలే అన్నట్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. గ్రిప్పింగ్ స్టోరీ, కథ, కథనం, ఎడిటింగ్‌లో మలయాళ ఇండస్ట్రీ ఇలాంటి జోనర్స్‌కు కేరాఫ్‌గా నిలిచారు. కోవిడ్ సమయంలో ఓటీటీలోకి మలయాళ సినిమాలు పెద్ద ఎత్తున రావడంతో అందరికీ వీరి టాలెంట్ ఏంటో తెలిసింది. నాటి నుంచి మలయాళం నుంచి వచ్చే సినిమాలకు ఓటీటీలో సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇటీవలి కాలంలో రిలీజ్ అవుతున్న సినిమాలే కాకుండా పాత సినిమాలను కూడా ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఫహద్ ఫాజిల్ నటించిన ఓ సినిమా కూడా ఓటీటీలోకి రెడీ అయ్యింది. అదే ఇరుళ్.

కరోనా సమయంలో ఓటీటీలోకి ఇరుళ్

నసిఫ్ యూసఫ్ ఐజుద్దీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్, దర్శనా రాజేంద్రన్, జిపా జాన్, మస్హర్ హంసా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌, ప్లాన్ జే స్టూడియోస్ బ్యానర్లపై ఆంటో జోసెఫ్, జామన్ టీ జాన్, షమీర్ మొహమ్మద్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. సీరజ్ సాజిల్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించగా.. జామన్ టీ జాన్‌ సినిమాటోగ్రఫి అందించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాను 2 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.

నాలుగేళ్లుగా తెలుగులో విడుదలవ్వని ఇరుళ్

నాడు కరోనా మహమ్మారి కారణంగా భారతదేశంలో లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో థియేటర్‌లో రిలీజ్ చేయడం సాధ్యం కాక.. ఓటీటీలోనే మేకర్స్ ఇరుళ్ చిత్రాన్ని విడుదల చేశారు. ఆ తర్వాత హిందీ, మరాఠీలలోకి ఈ సినిమాను డబ్ చేసి అల్ట్రా ప్లే అండ్ అల్ట్రా జాకస్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. దాదాపు 91 నిమిషాల నిడివితో ఇరుళ్ చిత్రాన్ని రూపొందించారు. అయితే దాదాపు నాలుగేళ్లు కావొస్తున్నా ఈ సినిమా తెలుగులో మాత్రం అందుబాటులోకి రాలేదు. మలయాళంలో ఈ సినిమాను కొందరు తెలుగు ప్రేక్షకులు చూసినప్పటికీ తెలుగులో వస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు.

Take a Poll

అపరాధిగా తెలుగులోకి

నాలుగేళ్ల గ్యాప్‌కు చెక్ పెడుతూ ఈ సినిమాను ఓటీటీలో తెలుగు వెర్షన్‌లోనూ అందుబాటులోకి తీసుకురావాలని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఇరుళ్ పేరుతో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని అపరాధి పేరుతో ఆహా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మే 8 నుంచి ఈ సినిమా తెలుగులో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. మరి ఈ అపరాధి తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Read more about: fahadh faasil irul Aparadhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X