OTTలోకి డైరెక్టుగా క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎందులో చూడాలంటే?
ఓటీటీలో గ్యాప్ లేకుండా డిఫరెంట్ జానర్ సినిమాలు వరుసగా వస్తూనే ఉంటాయి. మూవీ లవర్స్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా భిన్న కథలతో సందడి చేస్తుంటాయి. అందులో కొన్ని ముందస్తు ప్రకటనతో బజ్ క్రియేట్ చేసి వస్తే మరి కొన్ని ఎటువంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా వచ్చి ఆకట్టుకుంటాయి. ఇలా వచ్చిన వాటిలో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్స్‌కు రెస్పాన్స్ బాగా వస్తోంది. అందుకే వాటిపై మేకర్స్ మరింత ఫోకస్ పెట్టి తెరకెక్కిస్తున్నారు. అలా తాజాగా ఓ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చింది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఎందులో వచ్చింది? వంటి పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మలయాళ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. సూపర్ నేచురాలిటీ, యాక్టింగ్‌తో అవి ఆడియెన్స్‌కు సీట్ ఎడ్జ్థ్రిల్లింగ్ను పంచుతుంటాయి. ముఖ్యంగా మిస్టరీ క్రైమ్, మర్డర్ థ్రిల్లర్స్ ఉత్కంఠగా సాగుతుంటాయి. అందుకే వాటికి ఓటీటీలో మస్త్ క్రేజ్ ఏర్పడింది. అవి స్ట్రీమింగ్కు అందుబాటులో వచ్చీ రాగానే పుల్ రెస్పాన్స్‌తో వ్యూస్‌ను అందుకుంటుంటాయి. అందుకే యూజర్స్‌ను ఆకట్టుకునేందుకు, వారికి మరింత థ్రిల్‌ను పంచేందుకు ఈ మిస్టరీ క్రైమ్, మర్డర్ థ్రిల్లర్స్‌కు పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పోటీ పడి మరి విడుదల చేస్తుంటాయి.

అలా తాజాగా ఓ సినిమా సైలెంట్‌గా వచ్చేసింది. అది కూడా తెలుగు వెర్షన్లో. ఇందులో ఆకాశమే నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలో నటించింది. అదృశ్యం పేరుతో స్ట్రీమింగ్ అవుతున్న ఇది 2022లోని విడుదలై సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ముఖఅయంగా ఇందులో అపర్ణ తన నటనతో అందరిని ఆకట్టుకుంది.
ఈ చిత్రానికి సుదీష్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. ఇందులో అపర్ణ బాలరమురళితో పాటు హరీశ్ ఉత్తమన్, సిద్ధిఖీ ఇతర పాత్రల్లో నటించారు. అయితే విడుదలైన రెండేళ్లకు ఈ సినిమా తెలుగు వెర్షన్ వచ్చేసింది. దీని డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ దక్కించుకుని రిలీజ్ చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ సినిమాను సైలెంట్ వదిలింది. ఏప్రిల్ 4నుంచి ఇది ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ అదృశ్యం సినిమా కథేంటంటే? అపర్ణ అశ్విన్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. వీరిద్దరు పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. కానీ అంతలోనే ఆమె తన ఫ్రెండ్‌ను ఎవరో హత్య చేశానంటూ పోలీసులను ఆశ్రయిస్తుంది. కానీ అందలో ఆమె కూడా ఇరుక్కుంటుంది. మరోవైపు ఓ ఫ్యాక్టరీ కార్మికులు స్ట్రైక్‌ను చేస్తుంటారు. దాన్ని అన్యాయంగా ఆపేందుకు హోమ్ మినిస్టర్ ప్రయత్నిస్తుంటాడు. అసలు ఆ హత్య ఎవరు చేశారు? నిజంగానే ఆమెనే చేస్తుందా? లేదా ఎవరైనా ఇరికిస్తారా? హోమ్ మినిస్టర్ కుట్రలకు, ఆ మర్డర్‌కు, అపర్ణకు సంబంధం ఏంటి? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది. మరి మీరు క్రైమ్ థ్రిల్లర్ ప్రియులైతే ఈ సినిమాను చూసేయండి..


Click it and Unblock the Notifications











