OTT ఏప్రిల్ నెల ఓటీటీ సినిమాలు.. ప్రేమలు, గామి, ఓం భీమ్ బుష్ సహా మరెన్నో స్ట్రీమింగ్!
వేసవి కాలం వచ్చేసింది. ఈ మండే కాలంలో సినీ లవర్స్ కు చల్లని కబురు ఓటీటీలు తీసుకువచ్చాయి. ఈ ఏప్రిల్ నెలలో ఎన్నో సినిమాలు, సిరీసులు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నెలలో డజన్ల కొద్ది సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఈసారి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం.
ఈ ఏప్రిల్ నెలలో డజన్ల కొద్ది సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఈ నెలలో ఎన్నో సూపర్ హిట్టు సినిమాలతో పాటు సూపర్ హిట్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. అసలే ఎండకాలం ఇంట్లోనే కూర్చొని పిల్లలు, పేరెంట్స్ హ్యాపీగా సినిమాలు సిరీసులు చూడొచ్చు. పిల్లకు స్కూళ్ల సెలవులు రానున్నాయి.

ఇక ఓటీటీలో విశ్వక్ సేన్ నటించిన గామి, గోపిచంద్ భీమా సినిమాలు ఈ వారమే రిలీజ్ కానున్నాయి. ఇక హారర్ చిత్రం అనన్య నాగళ్ల తంత్ర, కామెడీ ఎంటర్టైనర్ శ్రీ విష్ణు ఓం భీం బుష్ ఓటీటీలో సందడి చేయనుంది. ఇక మలయాళం సూపర్ హిట్ ప్రేమలు చిత్రం కూడా స్ట్రీమింగ్ కు రెడీ అయింది. వీటితో పాటు.. హనుమన్ (ఇతర వెర్షన్లు), మరో మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ వంటి సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. వాటిపై ఓ లుక్ వేయండి.
ఓటీటీలో రిలీజ్ కాబోతున్న చిత్రాలు
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ప్రేమలు - ఏప్రిల్- 12
లంబసింగి - మంగళవారం- ఏప్రిల్- 2న స్ట్రీమింగ్ అవుతుంది
భీమా - శుక్రవారం ఏప్రిల్ 5న స్ట్రీమింగ్
జీ5 ఓటీటీ
గామి - (మార్చి 8న స్ట్రీమింగ్)
ఫారీ - ఏప్రిల్- 5న స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్
అమర్‌సింగ్ చమ్‌కీలా - ఏప్రిల్ -12న స్ట్రీమింగ్
చీఫ్ డిటెక్టివ్ - కొరియన్ డ్రామా- ఏప్రిల్- 19న స్ట్రీమింగ్
పారాసైట్- ద గ్రే వెబ్ సిరీస్- ఏప్రిల్- 5న స్ట్రీమింగ్
హాట్‌స్టార్
హనుమాన్ -(కన్నడ, తమిళం, మలయాళం వెర్షన్లు)- శుక్రవారం- ఏప్రిల్- 5న స్ట్రీమింగ్
సైరన్ - తమిళ క్రైమ్ థ్రిల్లర్- ఏప్రిల్- 11న స్ట్రీమింగ్

సోనీలివ్
అదృశ్యం టీవీ సిరీస్- ఏప్రిల్- 11 (ప్రతి గురు, శుక్రవారాల్లో రాత్రి 8 గంటలకు స్ట్రీమింగ్)
ఫ్యామిలీ ఆజ్ కల్- (హిందీ వెబ్ సిరీస్) - బుధవారం- ఏప్రిల్ 3న స్ట్రీమింగ్
ప్రైమ్ వీడియో
ఓం భీమ్ బుష్ - (ఈ నెలలోనే స్ట్రీమింగ్ కానుంది.)
అమెజాన్ మినీ టీవీ
యే మేరీ ఫ్యామిలీ సీజన్ 3 - గురువారం- ఏప్రిల్- 4న స్ట్రీమింగ్
ఆహా
తంత్ర- ఏప్రిల్ 5న స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











