ఓటీటీలోకి మరో అడ్వెంచర్ మూవీ.. ఒళ్లు గగుర్పొడిచేలా చేసే దీన్ని ఫ్రీగా చూడాలంటే!

హాల్‌వుడ్‌లో తెరకెక్కే అడ్వెంచరస్ మూవీలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తుంటుంది. మరీ ముఖ్యంగా సూపర్ మ్యాన్ కాన్సెప్టులతో వచ్చిన చిత్రాలు సంచలన విజయాలను అందుకున్నాయి. అలా వచ్చిన సినిమాల్లో 'అక్వామాన్' ఒకటి. 2018లో వచ్చిన ఈ చిత్రం హిట్ అవడంతో దీనికి సీక్వెల్‌గా 'ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్' మూవీని తీశారు.

జేమ్స్ వాన్ దర్శకత్వంలో జాసన్ మోమోవా, పార్టిక్ విల్సన్, అంబర్ హర్డ్ వంటి స్టార్లు నటించిన చిత్రమే 'ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్'. హిట్ మూవీకి కొనసాగింపుగా రావడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ అడ్వెంచరస్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసిన విషయం తెలిసిందే.

Aquaman and the Lost Kingdom Or Aquaman 2 OTT Details Revealed

అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా వచ్చిన 'ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్' చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన దక్కింది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు కూడా పోటెత్తాయి. ఇలా ఫుల్ రన్‌లో ఈ మూవీ 434.4 మిలియన్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 3624 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది.

క్రేజీ కాన్సెప్టుతో హైబడ్జెట్ పెట్టి రూపొందిన 'ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్' మూవీ థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుని సక్సెస్ అయింది. దీంతో ఇది వీలైనంత త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అది మాత్రం జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

Aquaman and the Lost Kingdom Or Aquaman 2 OTT Details Revealed

హై రేంజ్ యాక్షన్‌తో రూపొందిన 'ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్' సినిమాను ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ పద్దతిలో అందుబాటులోకి తెచ్చారు. అయితే, మే 21వ తేదీ నుంచి జియో సినిమాలో ఇది ఫ్రీగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఇక్కడ ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళంలో అందుబాటులో ఉంటుందని తాజాగా తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. 'ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్' సినిమాలో జాసన్ మోమోవా, పార్టిక్ విల్సన్, అంబర్ హర్డ్, రాండల్ పార్క్ తదితరులు నటించారు. ఈ మూవీని పీటర్ సఫ్రాన్, జేమ్స్ వాన్, రాబ్ కోవాన్‌లు నిర్మించారు. ఈ సినిమాకు రుపర్ట్ గ్రేగ్‌సన్ - విలియమ్స్ సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X