ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన ఆరియానా గ్లోరీ: నెట్ డ్రెస్‌లో లోపలివి కనిపించేలా!

గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. తద్వారా బుల్లితెర మీదనో, వెండితెరపైనో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ యాంకర్‌గా ప్రపంచానికి పరిచయం అయిన ఈ అమ్మడు.. బిగ్ బాస్ షో పుణ్యమా అని బడా సెలెబ్రిటీగా మారిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఆరియానా తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దాన్ని మీరూ చూసేయండి!

అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

యూట్యూబ్ యాంకర్‌గా ఆరియానా గ్లోరీ తన కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. అందులో ఆయనతో ఆమె బోల్డుగా మాట్లాడిన తీరుతో హైలైట్ అయింది. ఆ తర్వాత ఆర్జీవీ.. ఆరియానాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి ఆమె ఎంతగానో ఫేమస్ అయిపోయింది. అలా ఈమె పేరు మారుమ్రోగింది.

బిగ్ బాస్ ఛాన్సుతో మారిందిగా

బిగ్ బాస్ ఛాన్సుతో మారిందిగా


ఆరియానా గ్లోరీ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవడంతో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఆమె.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

వరుస అవకాశాలతో సందడిగా

వరుస అవకాశాలతో సందడిగా

బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఆరియానా ఎంతో ఫేమస్ అయింది. అంతేకాదు, వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు ఇలా ఫుల్ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. పలు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ సినిమాల్లో నటించింది. అలాగే, మరికొన్ని ప్రాజెక్టులను కూడా అందుకుంటూ దూసుకుపోతోంది.

బిగ్ బాస్ రీఎంట్రీ.. 10లక్షలకు

బిగ్ బాస్ రీఎంట్రీ.. 10లక్షలకు

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'లో బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ కూడా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. గతంలో మాదిరిగా ఈ బ్యూటీ సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ అలరిస్తూ వచ్చింది. ఫలితంగా మరోసారి ఫినాలేకు చేరుకుంది. అయితే, ఈ సారి మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసి అందరికీ షాకిచ్చింది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీనే

సోషల్ మీడియాలో ఫుల్ బిజీనే

ఆరియానా పేరు హైలైట్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక, షో తర్వాత ఈ బ్యూటీ మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ ఏదో ఒక పోస్టు పెడుతూ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ విపరీతంగా హాట్ టాపిక్ అవుతోంది.

అందాలను ఆరబోస్తోన్న భామ

అందాలను ఆరబోస్తోన్న భామ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతూ ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ కొన్ని హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్, నాభి అందాలను చూపిస్తూ ఫోజులు ఇస్తోంది. ఫలితంగా ఈమె క్రేజ్ మరింతగా పెరగడంతో పాటు ఈ అమ్మడు తరచూ వార్తల్లోనే నిలుస్తోంది.

నెట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులతో

నెట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులతో

ఆరియానా గ్లోరీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె నెట్ డ్రెస్ వేసుకుని లోదుస్తులు, ఎద భాగం కనిపించేలా ఫోజులిచ్చింది. ఎంతో స్టైలిష్‌గా కనిపించిన ఈ అమ్మడు.. రకరకలా భంగిమలతో సెగలు రేపింది. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X